VD 14: విజయ్ సినిమాకు డిఫరెంట్ టైటిల్.. పాన్ ఇండియా రేంజ్ ఉండాలి కదా!

VD 14: విజయ్ సినిమాకు డిఫరెంట్ టైటిల్.. పాన్ ఇండియా రేంజ్ ఉండాలి కదా!

రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) కెరీర్ లో ఎన్నడూ లేని విదంగా ఫుల్ బిజీగా ఉన్నాడు. వరుసగా 3 భారీ సినిమాలను సెట్ చేసి మరో రెండేళ్ల వరకు గ్యాప్ లేకుండా కష్టపడటానికి సిద్దమయ్యాడు. అందులో ఒకటి VD 14. దర్శకుడు రాహుల్ సంకృత్యన్ తెరకెక్కిస్తున్న పీరియాడికల్ పాన్ ఇండియా మూవీని టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇటీవల విజయ్ దేవరకొండ పుట్టినరోజు సంధర్బంగా ఈ ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించారు మేకర్స్. 

ఈ సందర్బంగా విడుదల చేసిన పోస్టర్ కి కూడా ఆడియన్స్ నుండి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ ఒక్క పోస్టర్ తో సినిమాపై  తారాస్థాయికి చేరుకుంటున్నాయి. అయితే తాజాగా ఈ ప్రాజెక్టు గురించి ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే.. ఈ సినిమాకు రణభాలి సినిమా టైటిల్ ను ఫిక్స్ చేస్తున్నారట మేకర్స్. ఇప్పటికే రిజిస్ట్రేషన్ పనులు కూడా పూర్తయ్యాయని, అధికారిక ప్రకటన ఒకటే మిగిలిందని ఫిలిం వర్గాల నుండి వస్తున్న సమాచారం.

ఈ న్యూస్ తెలుసుకున్న విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. పాన్ ఇండియా రేంజ్ అంటే ఆమాత్రం ఉండాలి కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే మొదలుకానుంది. ఇక మిగతా వివరాలు త్వరలోనే తెలియనున్నాని. మరి విజయ్ దేవరకొండ కెరీర్ లోనే మొదటి పీరియాడికల్ మూవీ వస్తున్న ఈ సినిమా ఏ రేంజ్ లో విజయాన్ని సాధిస్తుందో చూడాలి.