మహానటి : హేమ డ్రగ్స్ తీసుకున్నారు.. పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది..

మహానటి : హేమ డ్రగ్స్ తీసుకున్నారు.. పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది..

బెంగళూరు రేవ్ పార్టీలో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. పోలీసులు ఈ కేసులో దర్యాప్తు వేగవంతం చేయడంతో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. డ్రగ్స్ తీసుకున్నట్టు అభియోగాలు రావడంతో రేవ్ పార్టీలో పాల్గొన్న అందరికి బ్లడ్ టెస్ట్ నిర్వహించారు నార్కోటిక్ బ్యూరో. ఈ క్రమంలోనే 150 రక్త నమూనాలను సేకరించారు. అందులో 86 మందికి డ్రగ్స్ టెస్టులో పాజిటీవ్ వచ్చింది.

ఆ 86 మందిలో 27 మంది యువతులు, 57 మంది యువకులు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. నటి హేమా రక్తనమూనాల్లో కూడా డ్రగ్స్ ఉన్నట్టు తేలింది. పాజిటివ్‌గా తేలిన వ్యక్తులకు సీసీబీ నోటీసులు ఇస్తుంది. రక్త నమూనాలు పాజిటివ్‌గా తేలిన వారందరికీ సీసీబీ నోటీసులు జారీ చేసి సమన్లు ​​జారీ చేయనుంది.రేవ్ పార్టీలో పెద్ద ఎత్తున డ్రగ్స్ వినియోగించినట్టు పోలీసులు గుర్తించారు.

  రేవ్ పార్టీలో MDMA, కొకైన్, హైడ్రోగాంజా దొరికాయని వెల్లడించారు. సన్‌సెట్ టు సన్ రైజ్ విజయం పేరుతో రేవ్ పార్టీ నిర్వహించారని చెప్పారు. మరోవైపు బెంగళూరు రెవ్ పార్టీకి తనకు ఎటువంటి సంబంధం లేదని నటి హేమా విడుదల చేసిన వీడియో కాస్త వైరల్ గా మారింది. నెటిజన్స్ ఆ వీడియోపై ర్యాష్ గా కామెంట్ చేస్తున్నారు. చేసేదంతా చేసి తనకేమి సంబంధం లేదని నటి హేమా చెబుతుందని కామెంట్ చేస్తున్నారు.