మేడారం మహా జాతర–2026 పోస్టర్‌ను ఆవిష్కరించారు సీఎం రేవంత్ రెడ్డి. జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలో సీఎం రేవంత్ కు సమ్మక్క తల్లి కంకణం కట్టి, బొట్టు పెట్టారు మంత్రి సీతక్క. ఈ కార్యక్రమంలో మంత్రులు కొండా సురేఖ , పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు.
జనవరి 28 నుంచి 31 వరకు మేడారం మహా జాతర జరగనుంది. మొదటి రోజైన జనవరి 28 బుధవారం రోజున కన్నెపల్లి నుంచి సారలమ్మ, కొండాయి నుంచి గోవిందరాజులు, పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు మేడారంలోని గద్దెలపైకి చేరుకోనున్నారు. 29న చిలుకలగుట్ట నుంచి సమ్మక్కను తీసుకొచ్చి గద్దెపై ప్రతిష్ఠిస్తారు. 30న భక్తులు మొక్కులు సమర్పించనున్నారు. 31న సాయంత్రం 6 గంటలకు అమ్మవార్లను తిరిగి వనప్రవేశం చేయడంతో మహా జాతర ముగియనున్నది.
►ALSO READ | సమ్మక్క, సారక్క మనుషుల్లో దేవుళ్లు: సీఎం రేవంత్ రెడ్డి
మేడారం మహాజాతర సందర్భంగా భక్తుల సౌకర్యార్థం 3,495 ఆర్టీసీ బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది.మేడారం జాతర సందర్భంగా 28 ఎకరాల్లో బస్టాండ్, క్యూలైన్లు, భక్తులు వేచి ఉండే గదుల నిర్మాణాలు జరుగుతున్నాయి.జనవరి 25వ తేదీ నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయి
