సమ్మక్క, సారక్క మనుషుల్లో దేవుళ్లు: సీఎం రేవంత్ రెడ్డి

సమ్మక్క, సారక్క  మనుషుల్లో దేవుళ్లు: సీఎం రేవంత్ రెడ్డి
  • వారి పోరాటాలే తెలంగాణ చరిత్ర
  • మేడారం అభివృద్ధిపై సీఎం రేవంత్​రెడ్డి ఎమోషనల్ పోస్ట్

హైదరాబాద్: సమ్మక్క సారలమ్మ గిరిజన జాతర సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం మేడారంలో అభివృద్ధి పనులు ప్రారంభించిన సంగతి తెలిసిందే. మహా జాతరకు ముహూర్తం దగ్గరపడుతుండటంతో పనులు చకచకా పూర్తి చేస్తున్నారు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ఈ పనులకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. 

‘చరిత్రలో పేద జనుల కోసం పోరాడిన వాళ్లు.. బలహీనుల పక్షాన నిలిచి త్యాగాలు చేసిన వాళ్లు తెలంగాణకు దేవుళ్లు.. వారి సంస్కృతి మన అస్థిత్వం.. వారి పోరాటాలే తెలంగాణ చరిత్ర.. వారి త్యాగాలు తరతరాలకు స్ఫూర్తి.. సమ్మక్క, -సారక్క మనుషుల్లో దేవుళ్లు.. ఆ అమ్మల గద్దెలను ఆధునీకరించి వారి చరిత్రను మరింత గొప్పగా రేపటి తరాలకు అందించే దైవ సంకల్పమే మేడారంలో ప్రజా ప్రభుత్వం చేపట్టిన ఈ సత్కార్యం’ అంటూ క్యాప్షన్​ఇచ్చారు.