- స్టడీ టూర్లో భాగంగా విజిట్
హైదరాబాద్ సిటీ, వెలుగు: శీతాకాల స్టడీ టూర్లో భాగంగా 2025 బ్యాచ్‌కు చెందిన దేశవ్యాప్త ట్రైనీ ఐఏఎస్లు శనివారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వారు జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్‌ను కలిసి నగర పాలనా వ్యవస్థపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సమగ్ర అవగాహన పొందారు. జీహెచ్‌ఎంసీ నిర్మాణం, చట్టబద్ధ విధులు, నగర పరిపాలనలో ఎదురయ్యే సవాళ్లు, విధానాల అమలుపై కమిషనర్ వారికి వివరించారు. కార్యక్రమంలో పాల్గొన్న అదనపు, జోనల్ కమిషనర్లు, విభాగాధిపతులు తమ అనుభవాలను ట్రైనీలతో పంచుకున్నారు.
పద్మారావునగర్: శిక్షణ కార్యక్రమంలో భాగంగా 134 మంది గ్రూప్-1 అధికారులు శనివారం సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్లో అధ్యయన పర్యటన నిర్వహించారు. హాస్పిటల్లోని ఓపీ విభాగం, క్రిటికల్ కేర్ సర్వీసులు, మాతా శిశు సంరక్షణ కేంద్రం వంటి వివిధ విభాగాలను సందర్శించి, అక్కడ రోగులకు అందుతున్న వైద్య సేవలు, సౌకర్యాలు, నిర్వహణ విధానాలను క్షుణ్ణంగా పరిశీలించారు. హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎన్. వాణి, ఆర్ఎంవోలు, వైద్యాధికారులు పాల్గొన్నారు.
