హైదరాబాద్, వెలుగు: మున్సిపల్ చైర్మన్లు, మేయర్ల ఎంపికలో జనరల్ సీట్లలో బీసీలకు అవకాశం ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఈనెల 16న రాష్ట్రంలో జరగనున్న 116 మున్సిపల్ చైర్మన్లు, ఏడు కార్పొరేషన్ మేయర్ ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని పార్టీలు బీసీలకు జనాభా దామాషా ప్రకారం చైర్మన్లుగా అవకాశం కల్పించి సామాజిక న్యాయం పాటించాలన్నారు.
శనివారం హైదరాబాద్ లో మీడియాతో జాజుల మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల్లో జనరల్ స్థానాల్లో కూడా బీసీలు పోటీచేసి 60 శాతం కౌన్సిలర్లు, కార్పొరేటర్లుగా విజయం సాధించారని చెప్పారు. 90 %ఉన్న వారిని కాదని 9 %ఉన్న అగ్రకులాలకు చైర్మన్ పోస్టులు ఇస్తే ఊరుకోబోమని హెచ్చరించారు.
