డీజీఎఫ్‌‌‌‌‌‌‌‌టీ సర్క్యులర్ చట్టవిరుద్ధం.. అదానీకి హైకోర్టు లో ఊరట

డీజీఎఫ్‌‌‌‌‌‌‌‌టీ సర్క్యులర్ చట్టవిరుద్ధం..  అదానీకి హైకోర్టు లో ఊరట

హైదరాబాద్, వెలుగు: అదానీకి హైకోర్టులో ఊరట లభించింది. విదేశీ వాణిజ్య విధానంలో లేని షరతులను సర్కులర్ ద్వారా విధించే అర్హత డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్‌‌‌‌‌‌‌‌టీ)కు లేదని తీర్పు వెలువరించింది. అదానీ గంగవరం పోర్ట్ లిమిటెడ్ (ఏజీపీఎల్‌‌‌‌‌‌‌‌)కు కేంద్ర ప్రభుత్వం 2018లో జారీ చేసిన సర్క్యులర్‌‌‌‌‌‌‌‌ చట్టవిరుద్ధమని ప్రకటించింది. 

కంపెనీ చెల్లించిన సొమ్మును నాలుగు వారాల్లోగా వడ్డీతో సహా రూ. 2.95 కోట్లను తిరిగి చెల్లించాలని ఆదేశించింది. ఎగుమతి ప్రయోజనాలను గడిచిన కాలానికే పరిమితం చేస్తూ 2018లో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్‌‌‌‌‌‌‌‌ను కొట్టివేయాలంటూ అదానీ గంగవరం పోర్ట్ లిమిటెడ్ వేసిన పిటిషన్‌‌‌‌‌‌‌‌ను అనుమతించింది. డీజీఎఫ్‌‌‌‌‌‌‌‌టీ జారీ చేసిన సర్యులర్‌‌‌‌‌‌‌‌ కొట్టివేసింది.