ముంబై ఎయిర్ పోర్టులో 11 కిలోల గోల్డ్ సీజ్..

ముంబై ఎయిర్ పోర్టులో 11 కిలోల గోల్డ్ సీజ్..

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించగా.. పలువురు ప్రయాణికుల నుంచి పెద్ద మొత్తంలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పలువురు ప్రయాణికుల నుంచి రూ.7.46 కోట్ల విలువైన 11.40 కిలోల బంగారం, ఎలక్ట్రానిక్స్ వస్తువులను గుర్తించి సీజ్ చేశారు అధికారులు. మొత్తం 24 కేసుల్లో ఈ బంగారం, ఎలక్ట్రానిక్స్ వస్తులను పట్టుకున్నట్లు మే 22వ తేదీ గురువారం కస్టమ్స్ అధికారులు తెలిపారు. 

దుబాయి నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికులను అధికారులు తనిఖీ చేయగా.. బట్టలు, శానిటరీ ప్యాడ్, ట్రాలీ, లోదుస్తుల లోపల, ఇతర శరీరం ప్రదేశాలల్లో బంగారం దాచిపెట్టి  అక్రమంగా తరలించేందుకు ప్రయత్నిస్తూ పట్టుబడ్డారు.  శానిటరీ ప్యాడ్‌లో దాచిన 24 క్యారెట్ల గోల్డ్ డస్ట్, 2000 గ్రాముల బరువు కలిగిన బట్టలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కస్లమ్స్ అధికారులు వెల్లడించారు.