బుద్ధుని బోధనల ద్వారా చాలా స్ఫూర్తి పొందిన : సీఎం రేవంత్ రెడ్డి

బుద్ధుని  బోధనల ద్వారా చాలా స్ఫూర్తి పొందిన :   సీఎం రేవంత్ రెడ్డి

బౌద్ధ సిద్ధాంతం చాలా గొప్పదని  చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. సమాజం కోసం బుద్ధుడు ఎంతో తపించాడన్నారు. శాంతిని బోధించి, సమాజానికి మంచి చేయాలనుకున్న బుద్ధుడు ప్రపంచానికి ఆదర్శంగా నిలిచాడన్నారు. ఇవాళ బుద్ద పూర్ణిమ సందర్భంగా సికింద్రాబాద్ లోని మహాబుద్ద విహార్ ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొన్నారు.  గౌతమ బుద్ధుని బోధనల ద్వారా తాను చాలా స్ఫూర్తి పొందానన్నారు.  బుద్ధ విహార మందిరం కోసం తెలంగాణ ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని తెలిపారు.  ఎలక్షన్ కోడ్  ముగిసిన తర్వాత నిధులు మంజూరు చేస్తామన్నారు సీఎం.