
- కరప్షన్ పేరుతో మున్నూరు కాపులను పరేషాన్ చేస్తుండ్రు
- శివబాలకృష్ణ, నూనె శ్రీధర్, ఈఎన్సీ అనిల్ పై కేసులు పెట్టిండ్రు
- డీటీసీ పుప్పాల శ్రీనివాస్ పైనా ఏసీబీ కేసులు పెట్టిండ్రు
- గతంలో 11 మంది మున్నూరు కాపు ఎమ్మెల్యేలుండేది
- ఇప్పుడు కేవలం ముగ్గురే ఉన్నరు
- కేబినెట్ లో మా కులం ఎమ్మెల్యేకు స్థానం కల్పించాలె
- కరీంనగర్ లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్
కరీంనగర్: మున్నూరు కాపు కులానికి చెందిన అధికారులపై కేసులు పెట్టి ప్రభుత్వం వేధిస్తోందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆవేదన వ్యక్తం చేవారు. కరీంనగర్ భగత్ నగర్ లో మున్నూరు కాపు సంఘం కరీంనగర్ జిల్లా సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మున్నూరు కాపు కులానికి చెందిన ఇరిగేషన్ శాఖ ఈఈ నూనె శ్రీధర్, సహా పలువురు లంచాలు తీసుకున్నట్లు ఎలాంటి ఆధారాలు లేకపోయినా వారిపై కేసులు పెట్టి ప్రభుత్వం వేధిస్తోందన్నారు. తమ సామాజిక వర్గానికి చెందిన ఈఎన్సీ అనిల్ కుమార్ పైనా కేసులు పెట్టారని అన్నారు. ఆయన సిన్సియర్ ఆఫీసర్ అంటూ కితాబిచ్చారు. హెచ్ఎండీఏలో ఉన్న శివబాలకృష్ణ ఎలాంటి లంచం తీసుకోకున్నా ఏసీబీ దాడులు చేసి కేసులు పెట్టారన్నారు.
ఆయన లక్షో, కోటో లంచం తీసుకోలేదని అన్నారు. డీటీసీగా పనిచేసిన పుప్పాల శ్రీనివాస్ఉ పై కూడా ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారంటూ కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. మున్నూరు కాపులను వేధిస్తే తమ కులమంతా ప్రశ్నిస్తుందని అన్నారు. కులగణన పేరుతో మున్నూరు కాపు జనాభాను తగ్గించి చూపించారు. ఓటర్ లిస్టులో మా కులస్తుల పేర్లు లేకుండా చేసి మమ్మల్ని అవమానించారు. గతంలో 11 మంది మున్నూరు కాపు ఎమ్మెల్యేలు ఉండే వారని, ఇప్పుడు ముగ్గురే ఉన్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేబినెట్ లో మున్నూరు కాపు కులానికి చెందిన వారికి స్థానం కల్పించానలి డిమాండ్ చేశారు.
గతంలో కేసీఆర్ ఆర్టీసీ చైర్మన్ పదవిని మున్నూరు కాపు కులానికి చెందిన సోమారపు సత్యనారాయణ, బాజిరెడ్డి గోవర్ధన్ కు ఇచ్చారని అన్నారు. ఇప్పుడు కూడా ఆ పదవిని తమ కులానికి చెందిన వ్యక్తికే ఇవ్వాలని అన్నారు. జీహెచ్ఎంసీ మేయర్ పదవిని మున్నూరు కాపు కులానికి చెందిన బొంతు రామ్మోహన్, విజయలక్ష్మికి ఇచ్చారని గుర్తు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మున్నూరు కాపులు పెద్ద సంఖ్యలో పోటీ చేసి విజయం సాధించాలని గంగుల ఆకాంక్షించారు.