
తిరుమల వెళ్లేవాళ్లకు అలర్ట్.. ఎవరు కొండ ఎక్కాలన్నా తిరుపతి రావాల్సింది.. తిరుపతిలోని అలిపిరి నుంచి వెళ్లాల్సిందే.. మరో మార్గం లేదు.. వాహనాలు అన్నీ అలిపిరి చెక్ పాయింట్ దగ్గర అన్ని వాహనాలను చెక్ చేస్తారు.. మీరు బస్సులో వెళ్లినా.. కారులో వెళ్లినా.. జీపులో వెళ్లినా.. బైక్ పై వెళ్లినా.. అలిపిరి సెక్యూరిటీ పాయింట్ దగ్గర నుంచే వెళ్లాలి.. ఇప్పుడు అలిపిరి కంగారు పుట్టిస్తుంది.. భయపెడుతుంది. కారణం ఏంటో తెలుసా.. పులి.. అవును.. అలిపిరి చెక్ పాయింట్ దగ్గర వాహనాలు తనిఖీ చేసే ప్రాంతంలో పులి తిరుగుతుందంట..
2025, జూలై 17వ తేదీ రాత్రి ఓ పులి.. జింకను వేటాడి చంపింది. జింక పొట్ట భాగాన్ని తినేసింది. జూలై 18వ తేదీ ఉదయం సెక్యూరిటీ సిబ్బంది గమనించి.. ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే రంగంలోకి దిగిన ఫారెస్ట్ సిబ్బంది.. స్పాట్ కు చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించింది. చనిపోయి ఉన్న జింకను ఫారెస్ట్ సిబ్బంది ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం చేస్తున్నారు.
ALSO READ : అమ్రాబాద్‌లో 36 కి చేరిన పులులు
జింకను చంపింది పులినా లేక రేసు కుక్కలా అనే సందేహం వ్యక్తం చేశారు ఫారెస్ట్ అధికారులు. జింకను వేటాడిన విధానం చూస్తే ఇది పులిలా లేదని.. రేసు కుక్కల్లా ఉందనే అనుమానాలు వ్యక్తం చేశారు. పోస్టుమార్టం రిపోర్ట్ తర్వాత అసలు విషయం బయటపడుతుందని.. అప్పటి వరకు పులినా లేక రేసు కుక్కలా అనేది క్లారిటీ ఇవ్వలేం అంటున్నారు ఫారెస్ట్ అధికారులు.
అలిపిరి టోల్ గేట్ సమీపంలో పులి అనే వార్త.. జింకను చంపిన పులి అనే సమాచారం తిరుపతి వాసులనే కాకుండా తిరుమల అధికారులను. సెక్యూరిటీ సిబ్బందిని కంగారు పుట్టిస్తుంది. పోస్టుమార్టం రిపోర్టులో దాడి చేసింది పులి అని క్లారిటీ వస్తే మాత్రం.. వెంటనే బోనులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది అంటున్నారు సెక్యూరిటీ సిబ్బంది. ఇటీవల అలిపిరి మెట్ల మార్గంలో పులి జాడలు కూడా కనిపించాయి.