IPL 2024: యువ క్రికెటర్లతో తెలుగు బజ్జీల పాప హంగామా!

IPL 2024: యువ క్రికెటర్లతో తెలుగు బజ్జీల పాప హంగామా!

సన్ రైజర్స్ హైదరాబాద్.. శంకర్ దాదా జిందాబాద్ సినిమాలో 'గుడ్ మార్నింగ్ హైదరాబాద్'లా పలకడానికి ఎంత బాగుందో కదా..! లీగ్ దశలో వీరి ఆటతీరు కూడా అంతే బాగుండేది. ఆరంజ్ ఆర్మీ ఓపెనర్లు బ్యాటింగ్‌కు దిగుతున్నారంటే.. ప్రత్యర్థి జట్ల బౌలర్ల వెన్నులో వణుకు పుట్టేది. అలాంటిది ఉన్నట్టుండి ఏమైందో కానీ, సచిన్ టెండూల్కర్‌లా ఆడే వీరు గచ్చిబౌలి దివాకర్(బ్రహ్మానందం)లా మారిపోయారు. అనవసరంగా వికెట్లు పారేసుకుంటున్నారు.  కోల్‌కతాతో జరిగిన క్వాలిఫయర్-1లో అదే ఓటమికి దారితీసింది.

ఇప్పుడు ఇదంతా ఎందుకంటారా..! ఉంది.. అసలు మ్యాటర్ ఇక్కడే దాగుంది. మన క్రికెటర్లు ఆటపై పెట్టాల్సిన అమ్మాయిలపై పెడుతున్నారు. విరామ సమయాల్లో బ్యాట్‌తో పోటీ పడాల్సింది పోయి.. ఫోటోలకు పోజులిస్తున్నారు. ఆ వీరులు మరెవరో కాదు.. నితీష్ రెడ్డి, అబ్దుల్ సమద్, అభిషేక్ శర్మ. ఈ ముగ్గురితో ఓ తెలుగు యువనటి ఫోటోలు దిగింది. అవి నెట్టింట వైరల్ అవ్వగా.. వీరికి పరిచయం ఎలా ఏర్పడిందని నెటిజెన్స్ చర్చిస్తున్నారు.

క్రికెటర్లకు హీరోయిన్లతో పరిచయాలు.. ప్రేమలు అనేవి కామన్. విరాట్ కోహ్లీ- అనుష్క శర్మ, జహీర్ ఖాన్- సాగరిక ఘోష్ జంటలు పరిచయాలను ప్రేమగా మార్చుకున్న వారే. అలా ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటున్న కుషిత కల్లపు క్రికెటర్లతో పరిచయం పెంచుకునే ప్రయత్నం చేసింది. కాకపోతే ఈ తెలుగు యువనటి పరిచయం అంతవరకు వెళ్లకపోవచ్చు.

ఎవరీ కుషిత కల్లపు..?

తెలుగు అమ్మాయి అయిన కుషిత కల్లపు సోషల్ మీడియా ద్వారా మంచి ఫేమ్ సంపాదించుకొంది. పబ్ రైడింగ్‌లో పెట్టుబడి.. బజ్జీలు తినడానికి వెళ్ళామని చెప్పి ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది. ఆ సమయంలో బజ్జిలు పాపగా ఈ అమ్మడి పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మార్మోగిపోయింది. 

నటిగా కుషిత ఇటీవల మంచి అవకాశాలను సొంతం చేసుకుంటోంది. బాబు నెంబర్ వన్ బుల్ షిట్ గాయ్, చాంగురే బంగారు రాజా, నీతోనే నేను అనే మూవీస్‌లో నటించి మెప్పించిన ఈ అమ్మడు.. హీరోయిన్ గా నిలదొక్కుకునేందుకు బాగానే శ్రమిస్తోంది. కాకపోతేమ్ బోల్డ్ సీన్స్ మాత్రం చేయనంటోంది. మరో పక్క టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరయ్యేందుకు అటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది.