ప్రపంచంలోనే తొలిసారి ఓ మనిషికి బర్డ్ ప్లూ

ప్రపంచంలోనే తొలిసారి ఓ మనిషికి బర్డ్ ప్లూ
  • తమ దగ్గర ఫస్ట్ కేసు నమోదైందని డబ్ల్యూహెచ్ఓను అలర్ట్ చేసిన రష్యా

మాస్కో: కోళ్లు, పక్షులకు సోకే బర్డ్ ఫ్లూ పంజా విసిరింది. తొలిసారి ఓ వ్యక్తికి సోకింది. తమ దేశంలో ఒకరికి బర్డ్ ఫ్లూ (హెచ్5ఎన్8) సోకినట్టు సైంటిస్టులు గుర్తించారని రష్యా శనివారం వెల్లడించింది. ఈ మేరకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్ఓ)ను అలర్ట్ చేసింది. రష్యా హెల్త్ వాచ్ డాగ్ అయిన రోస్పోట్రెబ్నడ్జర్ హెడ్ అన్నా పపోవా మీడియాకు వివరాలు వెల్లడించారు. కిందటేడాది డిసెంబర్ లో సదర్న్ రష్యాలో బర్డ్ ఫ్లూ ప్రబలింది. ఆ సమయంలో అక్కడ కోళ్ల ఫారాల్లో పని చేస్తున్న ఏడుగురు వర్కర్లకు టెస్టు చేస్తే ఒకరికి బర్డ్ ఫ్లూ సోకినట్టు బయటపడిందని వెక్టర్ ల్యాబోరేటరీ సైంటిస్టులు చెప్పారని ఆమె తెలిపారు. ఆ వర్కర్ కు ఎలాంటి సీరియస్ హెల్త్ కాంప్లికేషన్స్ లేవన్నారు. ప్రపంచంలోనే తొలిసారి మనుషులకు బర్డ్ ఫ్లూ సోకిందని, డబ్ల్యూహెచ్ఓకు సమాచారం ఇచ్చామని చెప్పారు. ఏవియేషన్ ఇన్ ఫ్లుయెంజాలో వేర్వేరు రకాలు ఉన్నాయని, వీటిలో హెచ్5ఎన్8 స్ట్రెయిన్ వేగంగా వ్యాప్తి చెందుతుందని తెలిపారు. మనుషులకు సోకిన ఈ వైరస్ మ్యుటేట్ అవుతుందా లేదా అనేది ఇప్పుడే చెప్పలేమన్నారు. బర్డ్ ఫ్లూ సోకిన జంతువులతో లేదా కంటామినేట్ అయిన పరిసరాలతో కాంటాక్ట్ అయితే తప్ప మనుషుల నుంచి మనుషులకు స్ప్రెడ్ అయ్యే చాన్స్​లేదని డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది.