ఉప్పల్, వెలుగు: నగరంలో కల్తీ ఆహార విక్రయాలు అడ్డగోలుగా సాగుతున్నాయి. తాజాగా మల్లాపూర్ ప్రాంతంలో నాసిరకం డ్రై ఫ్రూట్స్ తిని ఓ బాలిక అస్వస్థతకు గురైంది. నాచారం మల్లాపూర్ ప్రాంతానికి చెందిన భరత్ అనే వ్యక్తి స్థానిక షాపులో డ్రై ఫ్రూట్స్ కొనుగోలు చేసి ఇంటికి తీసుకెళ్లాడు. వాటిని తిన్న అతని కూతురు ఒక్కసారిగా అనారోగ్యానికి గురవడంతో కంగారుపడ్డ భరత్.. డ్రై ఫ్రూట్స్ ప్యాకెట్‌ను చెక్ చేయగా అందులో పురుగులు కనిపించాయి.
వెంటనే షాపు యజమాని దగ్గరకు వెళ్లి నిలదీయగా.. ‘‘రిటర్న్ తీసుకునేది లేదు.. నీ ఇష్టం ఉన్న చోట చెప్పుకో ’’ అంటూ బెదిరించాడని బాధితుడు ఆరోపించాడు. ఎక్స్పైరీ అయిపోయిన, పురుగులు ఉన్న సరుకు అమ్ముతూ, అడిగితే రౌడీల్లా ప్రవర్తిస్తున్నారని ఇలాంటి వ్యాపారులపై ఫుడ్ సేఫ్టీ అధికారులు చర్యలు తీసుకోవాలని వీడియో తీసి పోస్ట్ చేశాడు.
