10.7 శాతానికి దిగొచ్చిన డబ్ల్యూపీఐ ఇండెక్స్‌‌‌‌‌‌‌‌

10.7 శాతానికి దిగొచ్చిన డబ్ల్యూపీఐ ఇండెక్స్‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ: దేశంలో హోల్‌‌‌‌‌‌‌‌సేల్ ధరల పరిస్థితులను తెలియజేసే డబ్ల్యూపీఐ  ఇండెక్స్‌‌‌‌‌‌‌‌ సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 18 నెలల కనిష్టమైన 10.7 శాతానికి కి దిగొచ్చింది.  డబ్ల్యూపీఐ వరసగా నాలుగో నెలలోనూ తగ్గినప్పటికీ, వరసగా 18 నెలల్లో కూడా  డబుల్ డిజిట్‌‌‌‌‌‌‌‌లోనే నమోదయ్యింది. ఈ ఏడాది ఆగస్టులో హోల్‌‌‌‌‌‌‌‌సేల్‌‌‌‌‌‌‌‌ ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లేషన్ 12.41 శాతంగా నమోదయ్యింది.

కిందటేడాది సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 11.80 గా రికార్డయ్యింది. ఈ ఏడాది మే నెలలో 15.88 %  దగ్గర డబ్ల్యూపీఐ రికార్డ్ లెవెల్‌‌‌‌‌‌‌‌ను టచ్ చేసింది. కమోడిటీల ధరలు తగ్గుతుండడంతో డబ్లూపీఐ నిలకడగా తగ్గుతోందని ఆర్థిక వేత్తలు చెబుతున్నారు.