TATA WPL 2026: నేడు (ఫిబ్రవరి 3) ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ఎలిమినేటర్.. లైవ్ స్ట్రీమింగ్, స్క్వాడ్, టైమింగ్ వివరాలు

TATA WPL 2026: నేడు (ఫిబ్రవరి 3) ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ఎలిమినేటర్.. లైవ్ స్ట్రీమింగ్, స్క్వాడ్, టైమింగ్ వివరాలు

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌)లో భాగంగా మంగళవారం (ఫిబ్రవరి 3) ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. ఈ హై వోల్టేజ్ మ్యాచ్ లో  ఢిల్లీ క్యాపిటల్స్,  గుజరాత్ జెయింట్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గెలిచిన టీమ్ గురువారం జరిగే ఫైనల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో తలపడుతుంది. వడోదర వేదికగా  బీసీఏ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. మ్యాచ్ సాయంత్రం 7:30 నిమిషాలకు ప్రారంభమవుతుంది. గుజరాత్ జెయింట్స్ ఈ మ్యాచ్ లో ఫేవరేట్ గా బరిలోకి దిగుతుంది. రెండు జట్లు బలంగా ఉండడంతో హోరా హోరీ పోరు ఖాయంగా కనిపిస్తుంది. 

డబ్ల్యూపీఎల్ చరిత్రలో అత్యంత నిలకడైన జట్టుగా పేరున్న ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా నాలుగో ఏడాది ప్లేఆఫ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అర్హత సాధించింది. గత మూడు సీజన్లలో ఫైనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చేరి రన్నరప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నిలిచిన ఢిల్లీ ఈసారి ఎలాగైనా కప్పు గెలవాలనే పట్టుదలతో ఉంది. ఇంకోవైపు లీగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మధ్యలో మూడు మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లో ఓడిపోయినప్పటికీ ఆ తర్వాత వరుసగా మూడు విజయాలతో గుజరాత్ జెయింట్స్ అద్భుతంగా పుంజుకుంది. ముఖ్యంగా ముంబై ఇండియన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై సాధించిన చారిత్రాత్మక విజయం ఆ టీమ్ కాన్ఫిడెన్స్‌‌ను డబుల్ చేసింది.లీగ్ దశలో ఢిల్లీపై ఆడిన రెండు మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లోనూ నెగ్గడం గుజరాత్ ఆత్మవిశ్వాసాన్ని పెంచే అంశం.

టైమింగ్, లైవ్ స్ట్రీమింగ్, టెలికాస్టింగ్ వివరాలు:

మ్యాచ్ సాయంత్రం 7:30 నిమిషాలకు ప్రారంభమవుతుంది. 7:00 గంటలకు టాస్ వేస్తారు
  
లైవ్ టెలికాస్ట్:  స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది

లైవ్ స్ట్రీమింగ్: జియో హాట్ స్టార్ యాప్, వెబ్‌సైట్ లో లైవ్ చూడొచ్చు.
     
ఢిల్లీ క్యాపిటల్స్ స్క్వాడ్:

షఫాలీ వర్మ, లిజెల్ లీ (వికెట్ కీపర్), లారా వోల్వార్డ్ట్, జెమిమా రోడ్రిగ్స్ (కెప్టెన్), మారిజానే కాప్, చినెల్లే హెన్రీ, నికి ప్రసాద్, స్నేహ రాణా, మిన్ను మణి, శ్రీ చరణి, నందిని శర్మ, ఎడ్ల స్రుజన, ప్రగతియా సింగ్, లూసీయా హామిలిటన్, ఆలనా కింగ్  

యూపీ వారియర్జ్ స్క్వాడ్:

మెగ్ లానింగ్ (కెప్టెన్), దీప్తి శర్మ, అమీ జోన్స్ (వికెట్ కీపర్), హర్లీన్ డియోల్, క్లో ట్రయోన్, శ్వేతా సెహ్రావత్, సిమ్రాన్ షేక్, సోఫీ ఎక్లెస్‌స్టోన్, ఆశా శోభనా జాయ్, శిఖా పాండే, క్రాంతి గౌడ్, డియాండ్రా డోటిన్, ప్రతీకా రావల్, త్రిష గొంగడి, పొబీ లీచ్ ఫీల్డ్, శిల్ప గిరి, సుమన్ మీనా, కిరణ్ నవగిరే