బాత్రూం దగ్గర సీసీ కెమెరాలు..టీచర్ అరెస్ట్

బాత్రూం దగ్గర సీసీ కెమెరాలు..టీచర్ అరెస్ట్

యాదాద్రి, వెలుగు: స్టూడెంట్స్​తో అసభ్యంగా ప్రవర్తించిన కరస్పాండెంట్, బాత్రూం వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించిన లేడీ ప్రిన్సిపల్​ను యాదాద్రి జిల్లా భువనగిరి టౌన్​ పోలీసులు అరెస్ట్​ చేశారు. వారిపై పోక్సో యాక్ట్​ కింద కేసు నమోదు చేశారు. పోలీసులు, స్టూడెంట్స్​పేరెంట్స్​ తెలిపిన వివరాల ప్రకారం.. టెన్త్​ క్లాస్​ ఎగ్జామ్స్​ను దృష్టిలో పెట్టుకొని భువనగిరిలోని ప్రైవేట్​స్కూల్​లో స్పెషల్​ క్లాసులు నిర్వహిస్తున్నారు. ఈ నెల 19న ఆదివారం క్లాస్​ముగిసిన తర్వాత కరస్పాండెంట్​రఘు వెంకట సురేశ్(60) ఓ స్టూడెంట్​ను పేరెంట్​వచ్చేవరకు తన గదిలో ఉండమన్నాడు. ఆ సమయంలో బాలికను కౌగిలించుకొని ముద్దాడాడు. బెదిరిపోయిన స్టూడెంట్​ కరస్పాండెంట్​ గది నుంచి బయటకు పరిగెత్తింది. అంతలోనే పేరెంట్​రావడంతో ఇంటికి వెళ్లిపోయింది. ఇంటికి వెళ్లిన తర్వాత పేరెంట్స్​తో విషయం చెప్పడంతో సోమవారం స్కూల్​వద్ద గొడవ జరిగినా విషయం బయటకు రాలేదు. మరికొందరు స్టూడెంట్స్​సైతం కరస్పాండెంట్​వారితో అసభ్యంగా ప్రవర్తించిన విషయాన్ని పేరెంట్స్​కు చెప్పడంతో మంగళవారం స్కూల్​ఎదుట ఆందోళనకు దిగారు. పోలీసులు, డిస్ట్రిక్ట్​వెల్ఫేర్​ఆఫీసర్​కృష్ణవేణి, డీసీపీవో సైదులు అక్కడికి చేరుకున్నారు. కరస్పాండెంట్​తమతో ఎలా అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడో స్టూడెంట్లు వివరించారు. స్టూడెంట్స్​ఆరోపణలను కరస్పాండెంట్​ తోసిపుచ్చారు. బాత్రూమ్​ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారని, తొలగించాలని ప్రిస్సిపల్ సుజాతకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని మరో స్టూడెంట్​పేర్కొంది. కరస్పాండెంట్ రఘు వెంకట సురేశ్, ప్రిన్సిపల్​సుజాతను భువనగిరి టౌన్​ పోలీసులు అరెస్ట్​చేశారు. వారిపై పోక్సో కేసు నమోదు చేశారు. జిల్లా విద్యాశాఖ కూడా స్కూల్​ గుర్తింపు రద్దు చేయాలని ఆర్​జేడీకి ప్రపోజల్స్​ పంపించింది.