కామేపల్లి, వెలుగు : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో యాదవులకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని యాదవ సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు, మాజీ జడ్పీటీసీ, డీసీసీబీ డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్, కామేపల్లి మాజీ పీఏసీఎస్ అధ్యక్షుడు, టీపీసీసీ మెంబర్ పుచ్చకాయల వీరభద్రం యాదవ్ కోరుతూ ఆదివారం టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్‌ను హైదరాబాద్‌లో కలిసి వినతి పత్రం అందజేశారు.
అనంతరం వారు మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 3 లక్షలకు పైగా యాదవులు ఉన్నారని, సాధారణ ఎన్నికల్లో గణనీయమైన స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి వెన్నంటి ఉండి ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించుకున్నామన్నారు. జనాభా ప్రాతిపదికన జిల్లా, రాష్ట్రస్థాయిలో నామినేటెడ్ పదవులకు అవకాశం కల్పించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి షేక్ పతే అహ్మద్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

