రాముడిని హిందువులే కాదు.. ముస్లింలు కూడా గౌరవిస్తారు.

రాముడిని హిందువులే కాదు.. ముస్లింలు కూడా గౌరవిస్తారు.

న్యూఢిల్లీ:  రాముడిని హిందువులు మాత్రమే కాదు.. ముస్లింలు కూడా గౌరవిస్తారని యోగా గురువు బాబా రాందేవ్ అన్నారు. దేశంలో 99 శాతం మంది ముస్లింలు మత మార్పిడికి గురైనవారేనని కామెంట్ చేశారు. రామజన్మభూమి, బాబ్రీమసీదు భూవివాదం కేసులో సుప్రీంకోర్టు తీర్పుతో రాముడి ఆలయం నిర్మాణానికి అనుమతి దొరికిందన్నారు. శనివారం నేషనల్ మీడియాతో మాట్లాడుతూ.. ” అయోధ్యలో రాముడి గుడి చాలా అందంగా ఉంటుంది. అది హిందువుల కల. మన సంస్కృతి, వారసత్వాన్ని రిఫ్లెక్ట్ చేసేలా ఉంటుంది. కాథలిక్స్ కు వాటికన్ సిటీ, ముస్లింలకు మక్కా, సిక్కులకు గోల్డెన్ టెంపుల్ తరహాలో హిందువులకు అయోధ్య పవిత్ర స్థలం కానుంది. రాముడి గుడి కట్టేందుకు ముస్లింలు సహకరించాలి. కొత్త మసీదు కట్టేందుకు హిందువులు కూడా సహకరించాలి”అని రాందేవ్ కోరారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత గొడవలు జరుగుతాయని కొందరు ఊహించారని, అది తప్పని తేలిందన్నారు. అయోధ్య తీర్పు తర్వాత దేశంలో లా అండ్ ఆర్డర్  సమస్య తలెత్తకుండా శాంతిని కాపాడేందుకు ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా  చేసిన ప్రయత్నాలను మెచ్చుకున్నారు.