జియో 5G రూ.758 Planతో ..Disney, హాట్ స్టార్ ఉచితం..

జియో 5G రూ.758 Planతో ..Disney, హాట్ స్టార్ ఉచితం..

రిలయన్స్ జియో.. భారతదేశంలోని ప్రముఖ టెలికాం సర్వీస్ ప్రొవైడర్లలో ఒకటి.. ఇది 44 కోట్ల కంటే ఎక్కువ కస్టమర్లను కలిగి ఉంది. రిలయన్స్ జియో కస్టమర్లకోసం అద్భుతమైన ప్లాన్లను అందిస్తోంది. కంపెనీ అనేక బండిల్ ఆఫర్లతో అనేక యూజర్ ఫ్రెండ్లీ , బడ్జెట్ ఫ్రెండ్లీ ప్లాన్లను లాంచ్ చేస్తున్నందున కస్టమర్లు నిరంతరం పెరుగుతూనే ఉన్నారు. Jio వార్షిక ప్లాన్లు, ఎంటర్ టైన్ మెంట్, డేటా బూస్టర్లు, డేటా ప్యాక్ లు, 5G అప్ గ్రేడ్ ల వంటి అనేక ఆఫర్లను అందిస్తోంది. కస్టమర్లు వారి అవసరాలకు , బడ్జెట్ కు అనుగుణంగా ప్లాన్లను ఎంచుకోవచ్చు. జియో అందిస్తున్న రెండు పవర్ ప్యాక్  ప్లాన్ ల గురించి తెలుసుకుందాం. 

రూ. 758 ప్లాన్ 

ఈ ప్లాన్ 84 రోజుల పాటు అపరిమిత కాలింగ్, OTT ని అందిస్తుంది. ది కస్టమర్లకోసం 126 GB డేటాను అందిస్తుంది. అంటే రోజుకు 1.5 డేటాను ఇస్తుంది. రోజుకు 100 SMS లను అందిస్తుంది. ఈ జియో ప్లాన్ గురించి గమనించినట్లయితే OTT, Disney+Hotstar లను ఉచితంగా అందిస్తుంది. సబ్ స్క్రిప్షన్ 90 రోజుల పాటు అందుబాటులో ఉంటుంది. దీంతోపాటు జియో సినిమా, జియో క్లౌడ్, జియో టీవీ అదనపు ప్రయోజనలున్నాయి. 

రూ. 666ప్లాన్ 

ఈ ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీ,  అపరిమిత కాలింగ్, 126GB డేటాను అందిస్తుంది. వీటిలో రోజుకు 1.5GB డేటాను ఉపయోగించుకోవచ్చు. Jio రోజుకు 100 SMS లు, ఏ రకమైనా OTT యాప్ కైనా ఉచిత సబ్ స్క్రిప్షన్ అందిస్తుంది.