గచ్చిబౌలి లో యువతిపై కత్తితో దాడి చేసిన యువకుడు

V6 Velugu Posted on Oct 28, 2021

హైదరాబాద్ గచ్చిబౌలి పీస్ పరిధిలోని వట్టి నాగులపల్లిలో దారుణం జరిగింది. యువతిపై దాడికి యత్నించాడు ప్రేమ్ సింగ్ అనే యువకుడు. రాత్రి 2 గంటల సమయంలో ఇంట్లోకి వెళ్లి అమ్మాయిపై కత్తితో దాడి చేశాడు. దీంతో అమ్మాయి గోంతు, చేతులపై గాయాలయ్యాయి. అమ్మాయి అరుపులతో కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులు.. యువకుడిని పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. అమ్మాయిని కాంటినెంటల్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితురాలి ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. డిగ్రీ చదువుతున్న ప్రేమ్ సింగ్ కొంత కాలంగా ప్రేమపేరుతో యువతిని వేధిస్తున్నట్లు తెలుస్తోంది.

Tagged Young Man, young woman, Attack, Gachibowli, knife

Latest Videos

Subscribe Now

More News