
శామీర్ పేట, వెలుగు: పెళ్లి కావడం లేదనే మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నారు. శామీర్ పేట పోలీస్ స్టేషన్ పరిధి మూడుచింతలపల్లి మండలంలోని అద్రాస్ పల్లి గ్రామానికి చెందిన శ్రీపతి శంకరయ్య కొడుకు వెంకటేశ్(25) ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. పెళ్లి కోసం సంబంధాలు రావడం లేదు. దీంతో గురువారం రాత్రి ఇంటి పైన గడ్డి మందు తాగాడు. కుటుంబ సభ్యులు వెంటనే దవాఖానకు తరలించగా శుక్రవారం తెల్లవారుజామున మృతిచెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.