
మెదక్ టౌన్ , వెలుగు: ఫైనాన్స్ వాళ్లు బండి గుంజుకుపోవడంతో మనస్తాపానికి గురై ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మెదక్ మండలం రాజ్ పల్లి గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన చాకలి రవి ఫైనాన్స్‌లో బైక్ తీసుకొన్నాడు. ఆర్థిక ఇబ్బందులతో నెల వారీ కిస్తులు చెల్లించలేకపోవడంతో ఫైనాన్స్ వారు వచ్చి అతడి బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీంతో మనస్తాపానికి గురైన రవి మంగళవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. మెదక్ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.