
జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. పెద్దలు పెళ్లికి అంగీకరించకపోవడంతో ఓ ప్రేమ జంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. యువకుడు మృతి చెందగా.. యువతి సురక్షితంగా బయటపడింది. యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. పెద్దలు ఒప్పుకోకపోవడంతో కొన్ని రోజుల నుంచి జవహర్ నగర్ లో రూం అద్దెకు తీసుకుని సహజీవనం చేస్తున్నారు ఇద్దరు ప్రేమికులు. రెండు రోజులు నుంచి ఇద్దరి మధ్య గొడవలవుతున్నాయి. మనస్పర్థలు పెరగటంతో శనివారం ఉదయం ఇద్దరు ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు యత్నించారు. ఫ్యాన్ కు చున్ని ఊడిపోవడంతో యువతి కిందపడింది. యువకుడికి అప్పటికే ఉరిబిగుసుకుని మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు యువతిని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు..