నిజామాబాద్ : టిక్ టాక్ మోజు ఓ యువకుడి ప్రాణం తీసింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలంలో జరిగింది. దినేష్ అనే యువకుడు గోను గొప్పుల శివారులోని కప్పుల వాగు చెక్ డ్యామ్ లో టిక్ టాక్ చేస్తూ.. నీటి ప్రవాహం లో కొట్టుకు పోయాడు. తన ఇద్దరు స్నేహితులు టిక్ టాక్ వీడియో రికార్డు చేస్తుండగా దినేష్ ఆ నీటిలో గల్లంతయ్యడు. రెండు రోజుల క్రిందట ఈ ఘటన జరగ్గా ఈ ఆదివారం అతని మృతదేహం లభ్యమైంది. టిక్ టాక్ వల్లే తన ప్రాణం పోయిందని అతని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

