ప్రేమించలేదని యువతి గొంతు కోసిన యువకుడు

ప్రేమించలేదని యువతి గొంతు కోసిన యువకుడు

సూర్యాపేట: జిల్లాలో దారుణం జరిగింది. తనను ప్రేమించలేదని యువతి గొంతు కోసి యువకుడు పరారయ్యాడు. నేరేడుచర్ల పట్టణంలోని అరవింద డిగ్రీ కాలేజీ సమీపంలో ఈ ఘటన జరిగింది. పట్టణానికి చెందిన బొత్తల బాల సైదులు అనే యువకుడు కొన్నాళ్లుగా ఓ యువతి వెంటపడుతున్నాడు. తనను ప్రేమించాలని ఆమెపై ఒత్తిడి చేస్తున్నాడు. దానికి యువతి అంగీకరించకపోవడంతో.. బాలసైదులు యువతి గొంతు కోసి అక్కడినుంచి పరారయ్యాడు. గమనించిన స్థానికులు యువతిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. యువతి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. యువకుడి కోసం గాలింపు చేపట్టారు.