
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్బంగా ఓ యువకుడు మొక్కలపై తనకున్న ప్రత్యేకమైన అభిమానాన్ని చాటుకున్నాడు. పదిహేను మొక్కలకు రాఖీ కట్టి, వాటి సంరక్షణ బాధ్యత తనదే నంటున్నాడు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం పైడిమడుగు గ్రామానికి చెందిన కొండవేని విజయ్ కి చెట్లు అంటే వల్లమాలిన అభిమానం. దాంతో తనకు అక్కచెల్లెళ్లు లేరని చెట్లే తమ సోదరీమణులుగా,రక్తసంబంధీకులుగా భావించి గ్రామంలోని భక్తుల మర్రివద్ద పదిహేను చెట్లు నాటి వాటికి రాఖీ కట్టాడు. ఈ రోజు నుండి పదిహేను చెట్ల పూర్తి భాద్యతలు తనవే అంటూ వాటిని మొక్కల నుండి వృక్షాల వరకు తానే పెంచుతానని చెబుతున్నాడు.మొక్కలను నాటడమే కాదు వాటిని పెంచినప్పుడే.. నాటిన దానికి విలువ అంటున్నాడు ఈ యువకుడు, ఇలా ప్రకృతిని ప్రేమించి ప్రతి ఒక్కరు తమ బాధ్యతగా చెట్లను రక్షిస్తే రాష్ట్రమంతా పచ్చ”ధనమే” అవుతుంది.