తుర్కపల్లి లో బైక్ పై గంజాయి తీసుకెళ్తూ పట్టుబడిన యువకుడు

తుర్కపల్లి లో బైక్ పై గంజాయి తీసుకెళ్తూ పట్టుబడిన యువకుడు

ఫ్రెండ్ వద్ద కొనుగోలు చేసి  అమ్మేందుకు తీసుకెళ్తూ దొరికాడు​   

శామీర్ పేట, వెలుగు :  బైక్ పై గంజాయి తీసుకెళ్తున్న యువకుడిని మేడ్చల్ ఎస్ వోటీ పోలీసులు పట్టుకున్నారు. సిద్దిపేట జిల్లా జగదేవ్ పూర్ మండలం వట్టిపల్లికి చెందిన కుకునూర్ రాకేశ్ బుధవారం బైక్ పై వెళ్తుండగా శామీర్ పేట మండలం తుర్కపల్లి బస్టాప్ వద్ద పోలీసులు ఆపారు. అతడిని తనిఖీ చేయగా గంజాయి దొరికింది.

యువకుడిని అదుపులోకి తీసుకుని విచారించగా..చేర్యాలకు చెందిన ఫ్రెండ్ రాజు వద్ద గంజాయి తీసుకుని సొంతూరు  వట్ పల్లిలో అమ్మేందుకు తీసుకెళ్తున్నట్టు రాకేశ్ తెలిపాడు. అతడి నుంచి 320 గ్రాముల గంజాయి, బైక్ , రూ,22,100 నగదు, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకుని జీనోమ్ వ్యాలీ పోలీసులకు అప్పగించారు.  రాజు పరారీలో ఉన్నాడు.