
మార్చి 12న లాస్ ఏంజిల్స్ లో జరగబోయే ఆస్కార్ వేడుకలకు టాలీవుడ్ యంగ్ టైగర్ హాజరు కానున్నారు. అందుకోసం ఇయ్యాళ యునైటెడ్ స్టేట్స్ కు వెళ్లారు. అంతకుముందు హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో కనిపించిన ఆయన.. రేపు అమెరికాలోని ఆర్ఆర్ఆర్ టీమ్‌లో జాయిన్ అవనున్నట్టు సమాచారం. ఆయన ఎయిర్ పోర్టులో నడుచుకుంటూ వెళ్లే వీడియోలు, ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఆస్కార్స్‌లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో పోటీపడుతున్న ఐదు పాటల్లో ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటు నాటు కూడా ఉండడంతో.. ఆ అవార్డును అందుకునే క్షణం కోసం యావత్ భారత్ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ప్రపంచ వేదికపై భారతీయ చలనచిత్ర పరిశ్రమకు జూనియర్ ఎన్టీఆర్ ప్రాతినిథ్యం వహించడం పట్ల చాలా మంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు.