
న్యూఢిల్లీ: మోడీ సర్కార్ కొత్త కేబినెట్‌ను విస్తరించింది. కిషన్ రెడ్డి, అనురాగ్ ఠాకూర్ లాంటి సహాయ మంత్రులకు ప్రమోషన్ ఇచ్చిన మోడీ.. జ్యోతిరాదిత్య సింధియా లాంటి పార్టీలోకి కొత్తగా వచ్చిన నేతలకూ కీలక బాధ్యతలు అప్పజెప్పింది. ఈ నేపథ్యంలో కొత్త మంత్రులకు ప్రధాని మోడీ కీలక సూచనలు చేశారు. మంత్రులు తమ సత్తా చాటాలని, తామేంటో పని ద్వారా నిరూపించుకోవాలన్నారు. కొత్తగా నియమితులైన మంత్రులు తమ ఆఫీస్‌లకు ఉదయం 9.30 గంటల్లోపు రావాలని, సమయపాలన విషయంలో క్రమశిక్షణను పాటించాలని ఆదేశించారు. మాజీ మంత్రులను కలసి వారి అనుభవాల నుంచి నేర్చుకోవాలని పేర్కొన్నట్లు తెలిసింది. మీడియా ఎదుట అనవసర కామెంట్లు చేయకూడదని హెచ్చరించినట్లు సమాచారం.