- ‘అమ్మానాన్న క్షమించండి’ అంటూ సెల్ఫీ వీడియో
జమ్మికుంట, వెలుగు: చిట్టీ డబ్బులు ఇవ్వకుండా వేధిస్తున్నారని, ఫలితంగా ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతూ మానసిక వేదనను అనుభవిస్తున్నానని ఒక యువకుడు సెల్ఫీ వీడియో తీసుకుంటూ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో జరిగింది. జమ్మికుంట మండలం విలాసాగర్ కు చెందిన అరుకాల సాయి కుమార్ జమ్మికుంట పట్టణానికి చెందిన నరహరిశెట్టి రాకేశ్ వద్ద రూ.6 లక్షల చిట్టీ వేశాడు.
చిట్టీ గడువు ముగిసినా డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాడని, అంతేకాకుండా తన వద్ద ఉన్న క్రెడిట్ కార్డులు తీసుకొని ఇవ్వడం లేదని సెల్ఫీ వీడియో తీసుకుంటూ తీసుకుంటూ ‘అమ్మానాన్నా నన్ను క్షమించండి’ అంటూ పురుగుల మందు తాగాడు. దీంతో సాయికుమార్ ను ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నారు.
