
నల్గొండ : కొన్ని రోజులుగా తనను వేధిస్తున్న యువకుడికి తగిన గుణపాఠం చెప్పింది ఓ వివాహిత. భర్త లేని సమయంలో యువకుడు వివాహితపట్ల అసభ్యకరంగా ప్రవరిస్తున్నాడు. పరువు పోతుందేమోనని మహిళ ఊరుకునన్నప్పటికీ యువకుడిలో వెకిలిచేష్టలు రోజురోజుకి పెరిగిపోయాయి. దీంతో విసుగుచెందిన వివాహిత..ఆ యువకుడిని చెట్టుకు కట్టేసి చితకబాదింది. ఈ సంఘటన గురువారం నల్గొండ జిల్లాలో జరిగింది.
వివరాలు : ఆర్జాలబావికి చెందిన శ్రీశైలం అనే యువకుడు అదే కాలనీకి చెందిన వివాహిత పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. దీంతో మహిళ తన భర్తతో కలిసి యువకుడిని పట్టుకుని.. చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేసింది. సమాచారం అందుకున్న నల్గొండ రూరల్ పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.