హైదరాబాద్లో SBI ఏటీఎం దగ్గర దొంగతనం చేస్తూ అడ్డంగా దొరికాడు !

హైదరాబాద్లో SBI ఏటీఎం దగ్గర దొంగతనం చేస్తూ అడ్డంగా దొరికాడు !

హైదరాబాద్: మియాపూర్ లో ATM దగ్గర చోరీ జరిగింది. డయల్100కు సమాచారం అందగానే మియాపూర్ పోలీసులు క్షణాల్లో స్పందించారు. SBI ఏటీఎం దగ్గర దొంగతనం చేస్తుండగా నిందితుడిని అరెస్ట్ చేశారు. ఘటనా స్థలంలోనే ఏటీఎం దొంగను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హఫీజ్‌పేట్, మార్తాండ నగర్, మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇతను దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. 

ఆదివారం రాత్రి సమయంలో ఘటన జరిగింది. నిందితుడు  కాటమయ్య స్వస్థలం జార్జ్‌పేట్ గ్రామం, అక్కంపల్లి మండలం, అనంతపురం జిల్లా అని పోలీసులు తెలిపారు. పోలీసుల అప్రమత్తతతో ఏటీఎం దగ్గర పెద్ద నష్టం తప్పింది. నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అనుమానాస్పద కదలికలు గమనిస్తే వెంటనే డయల్100కు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు.

►ALSO READ | అర్జున్ శర్మ బాయ్ ఫ్రెండ్ కాదు.. రూంమేట్ : అమెరికాలో హత్యకు గురైన నిఖిత తండ్రి
 
ఇదిలా ఉండగా.. కీసర జ్యూవెలరీ షాపులో దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. దోపిడికి పాల్పడిన ఐదుగురు నిందితులను మల్కాజ్ గిరి పోలీసులు అరెస్టు చేశారు. జువెలరీ షాప్ యజమానికి తుపాకీ చూపించి.. గొడ్డలితో దాడి చేసి దుండగులు ఆభరణాలు ఎత్తుకొని పోయిన సంగతి తెలిసిందే. దుండగుల దాడిలో షాపు యజమాని తీవ్ర గాయాలపాలయ్యాడు.