స్కూళ్లలో సక్కగ సదువు చెప్తలేరు.. MLAకు కంప్లయింట్

స్కూళ్లలో సక్కగ సదువు చెప్తలేరు.. MLAకు కంప్లయింట్

పిల్లలు ఇంగ్లిష్​లో ఒక్కపేరాగ్రాప్​ కూడా రాస్తలేరు

ఎమ్మెల్యే దృష్టికి తెచ్చిన కేవీపీఎస్​, ఎంవీఎఫ్​ నాయకులు

వికారాబాద్​ జిల్లా, వెలుగు:  ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్ధులకు చదువులు సక్రమంగా చెప్పడంలేదని కేవీపీఎస్​, ఎంవీఎఫ్​లు ఎమ్మెల్యే డాక్టర్​ అనంద్​కు ఫిర్యాదు చేశాయి. ఈ మేరకు కేవీపీఎస్​ జిల్లా కార్యదర్శి ఆర్​.మహిపాల్​రెడ్డి, ఎంవీఎఫ్​ మండల ఇన్​చార్జి వెంకటయ్య   ఆదివారం ఎమ్మెల్యేను క్యాంప్​ ఆఫీసులో కలుసుకుని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2009  విద్యాహక్కు చట్టం ప్రకారం విద్యార్థులకు వారి సామర్ధ్యాలకు అనుగుణంగా విద్య అందించాలన్న నిబంధనలు అమలుకు నోచుకోవడంలేదన్నారు.

వికారాబాద్​ మండలంలోని 13 గ్రామాల్లో విద్యా సామర్ధ్యాల సాధన కమిటీ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ, ఎస్​ఎంసీ కమిటీ సభ్యులు, తల్లిదండ్రులు, సీఆర్​పీఎఫ్​ నాయకులు, సామాజిక కార్యకర్తలు గత ఏప్రిల్ లో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో చదవుతున్న 5 నుంచి 10వతరగతి విద్యార్ధులపై  చేసిన ఆద్యయనంలో అనేక అంశాలు వెలుగులోకి వచ్చాయని వారు వివరించారు. తమ అధ్యయనంలో 377 మంది బాలలకు 3 వతరగతి సామర్ద్యాలతో కూడిన పత్రం ద్వారా తెలుగు, గణితం,  ఇంగ్లిష్​ విషయాలపై విద్యా సామర్ద్యాలపై పరిశీలించామని, విద్యార్ధులు తెలుగులో కనీసం నాలుగైదు  సరళమైన వ్యాక్యాలు కూడా రాయలేకపోతున్నట్లు గుర్తించామన్నారు.  గణితంలో చిన్న చిన్న కూడికలు, తీసివేతలు, గుణంకాలు, బాగాహారాలు చేయలేకపోవడం, ఆంగ్లములో పదాలు, వాక్యాలు, సోంతంగా పెర గ్రాప్​ రాయడంలోనూ వెనుకంజవేస్తున్నారని తెలిపారు. గత సంవత్సరం 5నుంచి 9 వరకు పూర్తి చేసిన విద్యార్థులు వారి తరగతి తగ్గ సామర్ద్యాలు పొందడంలో పూర్తిగా వెనుబడి ఉన్నారని తెలిపారు.  ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించినట్లు వారు చెప్పారు.