రేవంత్ మాటలను నమ్మే పరిస్థితి లేదు: ఎర్రబెల్లి

రేవంత్ మాటలను నమ్మే పరిస్థితి లేదు: ఎర్రబెల్లి

ఎమ్మెల్సీ ఎన్నికలో కాంగ్రెస్ కు ఓటేస్తే మనల్ని మనమే మోసం చేసుకుంటున్నట్టు అవుతుందన్నారు మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. విద్యావంతుడైన రాకేశ్ రెడ్డిని గెలిపిస్తే మేలు జరుగుతుందన్నారు. గతంలో వడ్లు కొనమని కేంద్రం దగ్గరకు వెళ్తే నూకలు తిన్నారని అన్నారు. అయినప్పటికీ కేసీఆర్ ప్రతి గింజను కొని రైతులకు ఇబ్బంది లేకుండా చేశారన్నారు. ఎన్నికల ముందు వడ్లు కొంటాం, మక్కలు కొంటామని చెప్పిన రేవంత్.. ఇప్పుడు ఎక్కడికి వెళ్లారని ప్రశ్నించారు. రేవంత్ మాటలను నమ్మే పరిస్థితి లేదన్నారు ఎర్రబెల్లి.

తీన్మార్ మల్లన్న ఒక బ్లాక్ మెయిలర్.. చీటర్ అని ఆరోపించారు ఎర్రబెల్లి.. సీఎం రేవంత్ రెడ్డికి..తీన్మార్ మల్లన్న కు తేడాలేదన్నారు.  మోసగాళ్ళలో నెంబర్ వన్ రేవంత్ రెడ్డి అయితే  నెంబర్ టూ తీన్మార్ మల్లన్న అని విమర్శించారు.