దోస్తులు తగ్గుతున్నరు! ప్రపంచవ్యాప్తంగా స్నేహితుల కొరత

దోస్తులు తగ్గుతున్నరు! ప్రపంచవ్యాప్తంగా స్నేహితుల కొరత
  •  
  • 1960ల్లో ఒక్కొక్కరికి 100 మంది ఫ్రెండ్స్..​1990లో ఐదుగురే..
  • ఇప్పుడు ఒక్కరు ఉండడం కూడా గగనమే.. 
  • మన దేశంలో 12 నుంచి 15 శాతం మందికి ఫ్రెండ్సే లేరు
  • అర్బన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 43 శాతం మందికి ఒంటరితనమే ఇష్టం  
  • ఇది ‘ఫ్రెండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్ రిసెషన్’ అంటున్న సర్వేలు  
  • ఐసోలేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అలవాటు పడుతున్న జెన్ జీలు

మైత్రి.. ఇటీవల ఒక పెద్ద నగరంలోని ప్రముఖ వర్సిటీలో పీజీ చదవడానికి చేరాడు. అక్కడి హాస్టల్ విద్యార్థుల్లో డైవర్సిటీ చాలా ఎక్కువ. సోషలైజేషన్‌‌కు బాగా అవకాశాలున్న వాతావరణం. అయితే, మైత్రి మాత్రం అక్కడ మింగిల్​ కావడం లేదు. ఎప్పుడూ ఒంటరిగానే ఉండడానికి ఇష్టపడతాడు. ఫోన్‌‌లో మాత్రం అందరితోనూ మాట్లాడాలని,చాట్ చేయాలని ఆసక్తి చూపిస్తాడు.  ఉదయం 6 గంటలకే లేచి జిమ్‌‌కు వెళ్తాడు. కానీ, అక్కడా ఎవరితోనూ మాట్లాడడానికి ప్రయత్నించడు. రాత్రి కచ్చితంగా 11 గంటలకు బెడ్‌‌పైకి వెళ్తాడు. కానీ, నిద్రపోకుండా అర్ధరాత్రి 2 గంటల వరకు రీల్స్, వీడియోలు చూస్తూ గడుపుతాడు. మైత్రి ఒక్కడే కాదు.. అతడిలాగే వర్సిటీలో చేరిన జెన్ జీ యువత చాలామంది ఇలాగే ఉన్నారు.  

హైదరాబాద్ సిటీ, వెలుగు: స్నేహ సంబంధాలు తగ్గిపోతున్నాయి. నగరాల్లో బిజీ లైఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టైల్, స్మార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోన్​అడిక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఫ్రెండ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో గడిపేందుకు.. మనసువిప్పి మాట్లాడేందుకు సమయమే దొరకడం లేదు.  ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా స్నేహితుల కొరత ఏర్పడుతున్నది. ఇదికాస్తా ‘ఫ్రెండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెసిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ (స్నేహ మాంద్యం)కు దారితీస్తున్నది. ఒకప్పుడు ఫ్రెండ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో బాధలు చెప్పుకున్నోళ్లు.. మంచిచెడ్డలు పంచుకున్నోళ్లు కాస్తా ఐసోలేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అలవాటుపడిపోతున్నారు. వీరు డిప్రెషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లాంటి మానసిక రుగ్మతల బారినపడుతున్నారని సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఒకప్పుడు ఎవరైనా ఇంటి నుంచి బయటకు వస్తే ఫ్రెండ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తోనే ఎక్కువగా గడిపేవారు. సెలవు రోజైతే ఉదయం నుంచి సాయంత్రం వరకు రాజకీయాలు, సినిమాలు, ఊరు, కాలేజీ ముచ్చట్లతో అప్పుడే రోజు గడిచిపోయిందా? అని అనిపించేంది. అప్పట్లో స్నేహితుల సంఖ్యతోపాటు వారితో గడిపే సమయం కూడా ఎక్కువగానే ఉండేది. కానీ, ఇప్పుడు మనిషి దానికి దూరమైపోతున్నాడు. సెలవు దొరికితే రెస్ట్​ తీసుకోవడానికో..లేక ముఖ్యమైన పనులు పూర్తి చేసుకోవడానికో వాడుకుంటున్నాడు.  చాలామంది ఉద్యోగాలు, చదువులు, పిల్లల భవిష్యత్తు​కోసం నగరాల బాట పట్టడం, చిన్నప్పుడు ఉన్న స్నేహితులు దూరం కావడం, కొత్తవారితో ఫ్రెండ్‌‌షిప్‌‌ చేసేందుకు  సమయం లేకపోవడం, చేసుకున్నా వారి స్థానం చిన్నప్పటి స్నేహితులకు ఇవ్వకపోవడంలాంటి కారణాలు మనిషిని ఒంటరివాడిని చేస్తున్నాయి. దీన్నే ఇప్పుడు ‘ఫ్రెండ్‌‌షిప్ రిసెషన్’ అంటున్నారు. ఇది మానసిక ఆరోగ్యం నుంచి శారీరక ఆరోగ్యం వరకు తీవ్ర ప్రభావం చూపుతున్నదని పలు రిపోర్టులు చెబుతున్నాయి. 

లోన్లీ.. ఐయామ్​ మిస్టర్​లోన్లీ...

1960 ప్రాంతంలో ఒక్కొక్కరికి 100 మంది స్నేహితులు ఉండేవారు. 1990లో ఈ సంఖ్య ఐదుగురికి చేరింది. ఇప్పుడు ఒక్కరు ఉండడం కూడా గగనమైంది. మన దేశంలో 12 నుంచి 15 శాతం జనాభాకు అసలు స్నేహితులే లేరని ఒక సర్వేలో వెల్లడి కాగా, ప్రపంచవ్యాప్తంగా 300 మిలియన్ల మందికి ఫ్రెండ్స్​లేరని మరొక సర్వే తేల్చింది. మన దేశంలోని పట్టణ, నగర ప్రాంతాల్లో 43 శాతం మంది ఎక్కువగా ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడుతున్నారని, వీరికి స్నేహితులు అనే వారే లేరని ‘ఇప్సోస్’ అనే సంస్థ చేసిన సర్వే తేల్చింది. ముంబై, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్‌‌లాంటి మెట్రో సిటీల్లో 60 శాతం వరకు ఒంటరితనం ఫీల్​అవుతున్నారని ‘రెడ్​ల్యాబ్’, ‘యూగో’ సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. యువతలో ఇది మరింత ఎక్కువగా ఉందని, అందరూ చర్చించుకుంటున్న  జెన్ జీల్లో 36 నుంచి --43 శాతం మంది ఎమోషనల్ ఐసోలేషన్‌‌కు గురవుతున్నారని ఆ సర్వేలు తేల్చి చెప్పాయి. అలాగే, గతంలో వారానికి స్నేహితులతో 5 నుంచి 6  గంటలు గడిపితే, ఇప్పుడు అది రెండున్నర గంటల కంటే తక్కువకు పడిపోయింది. ఫేస్- టు- ఫేస్ ఇంటరాక్షన్ తగ్గడంతో డిజిటల్ కనెక్షన్లపై ఆధారపడడం పెరిగిందని సర్వే చెప్తున్నది.  

దోస్తాన్‌‌ లేకుంటే అనారోగ్య సమస్యలు..

స్నేహితులతో ఉండడం, వారితో మనసులోని మాటలు చెప్పుకోవడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గిపోతుంది. స్నేహితులు లేని వారు రోజుకు 15 సిగరెట్లు తాగినంత (లేదా అంతకంటే ఎక్కువ) ఒత్తిడిని, హెల్త్ రిస్క్ ఎదుర్కొంటారని కొన్ని ఆరోగ్య పరిశోధనలు చెప్తున్నాయి. వీరిలో బ్లడ్ ప్రెషర్, గుండె జబ్బులు, స్ట్రోక్ రిస్క్‌‌లు కూడా పెరుగుతాయి. ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. ఒంటరితనం ప్రీమెచ్యూర్ డెత్ రిస్క్‌‌ను 26 నుంచి --30 శాతం పెంచుతుంది. ఇది ఊబకాయం, ధూమపానం కంటే ఎక్కువ హానికరం. స్నేహితులతో ఉండేవారు ఆహ్లాదంగా ఉంటారని.. దీనివల్ల మానసికోల్లాసం పెరుగుతుందని డాక్టర్లు చెప్తున్నారు.  

ఫ్రెండ్‌‌షిప్​ఇన్వెస్ట్‌‌మెంట్​ 

స్నేహం అనేది ఒక ఇన్వెస్ట్‌‌మెంట్​అని, దీనివల్ల భవిష్యత్తులో లాభాలే తప్ప నష్టాలు ఉండవని యూనివర్సిటీ ఆఫ్ కాన్సాస్ పరిశోధకుడు జెఫ్రీ హాల్ చెప్తున్నారు. ఆయన అధ్యయనం ప్రకారం  క్యాజువల్ ఫ్రెండ్‌‌షిప్ ఏర్పడాలంటే 40-- నుంచి 60 గంటలు కలిసి ఉండాలని, మంచి స్నేహం కోసం 80- నుంచి -100 గంటలు, ఇక క్లోజ్ ఫ్రెండ్‌‌షిప్ కోసం అయితే సదరు వ్యక్తితో 200 గంటలుపైగా ఉంటేనే సాధ్యపడుతుందని అంటున్నారు. ప్రస్తుత బిజీ షెడ్యూల్స్, ట్రాఫిక్, స్క్రీన్ టైమ్ వల్ల ఇంత సమయం ఎవరికీ ఉండడం లేదని, అందుకే  ‘సమయం లేదు మిత్రమా’ అంటూ.. బలపడే స్నేహబంధానికి మొదటి పది నిమిషాల్లోనే టాటా, బై బై చెప్పేస్తున్నారంటున్నారు.  

పనిచేసే చోట దోస్తులవుతారా? 

పనిచేసే చోట ఫ్రెండ్‌‌షిప్​చాలా వరకు ఉత్తివే అని నిపుణులు అంటున్నారు. వృత్తిలో భాగంగా ఏర్పడే స్నేహితుల్లో ఆఫీసు వేళల్లో మాట్లాడుకోవడానికే పనికి వస్తారని, కొందరు కాల్స్​చేసి మాట్లాడుకుంటారని, అవి కూడా ఆఫీసు విషయాలు మాట్లాడుకోవడానికే పరిమితం అవుతారని అంటున్నారు. వ్యక్తిగత విషయాలు ప్రాణ స్నేహితులకు మాత్రమే షేర్​ చేస్తారని, ఆఫీసుల్లో పని చేసేటప్పుడు ఏర్పడే ఫ్రెండ్‌‌షిప్​అలాంటిది కాదంటున్నారు. ఇక సోషల్ మీడియా, వాట్సాప్ ఫ్రెండ్స్ లేదా బార్/రెస్టారెంట్ స్నేహాలు మత్తు లేదా సౌకర్యం ఉన్నంత వరకే ఉంటాయని చెబుతున్నారు. డిజిటల్ జీవితం, లేట్ మొబిలిటీ, పోస్ట్- కొవిడ్ మార్పులు  కొన్ని ఈ లోన్లీనెస్​కు దారితీస్తున్నాయని అంటున్నారు. 

ఇలా చేసి చూడండి..

ఉద్యోగ ఒత్తిడి, డిజిటల్ జీవనం, మారిన ఊర్లు, పాండమిక్ ప్రభావాల వల్ల స్నేహాలు లోతుగా పెరగడం కష్టమవుతున్నది. రిపీటెడ్ ఇంటరాక్షన్.. ఒకే ఆలోచనలను పంచుకోవడం ద్వారా ఏర్పడతాయని సైకాలజిస్టులు చెబుతున్నారు.  పాత స్నేహితులతో బాధలు, ఆనందాలు పంచుకుంటూ ఉంటే ఆ స్నేహం కలకాలం కొనసాగుతుంది. ఇబ్బంది సమయాల్లో సపోర్ట్ చేయడం, సీక్రెట్స్‌‌ను కాపాడటంలాంటివి చేస్తే  ఫ్రెండ్‌‌షిప్‌‌లో నమ్మకం పెరుగుతుంది. అసూయ, టాక్సిక్ పీర్ ప్రెషర్ ఉన్నవారిని దూరంగా ఉంచడం వల్ల ప్రశాంతంగా ఉండవచ్చు.  

  •  క్యాలెండర్‌‌లో స్నేహితుల కోసం సమయం షెడ్యూల్ చేయండి. వీక్లీ కాఫీ, మంత్లీ డిన్నర్ ప్లాన్​ చేసుకొని కలుసుకోవడం బెటర్​. ఈ ప్రోగ్రామ్‌‌ను ఎవరో డిసైడ్​చేయాలని అనుకోకండి. మీరే ఇనిషియేట్ తీసుకోండి. ‘ఈ వీకెండ్ ఫ్రీనా’, కాఫీకి వెళ్దాం, చాయ్​కి పోదాం అని తీసుకువెళ్లండి.
  • డెయిలీ రొటీన్‌‌లో వీలైతే స్నేహితుల భాగస్వామ్యం ఉండేలా ప్లాన్​చేయండి. మార్నింగ్​లేదా ఈవినింగ్​వాక్​, సెలవు రోజుల్లో ఇంట్లో కుకింగ్, లేదా సినిమాకు వెళ్లడంలాంటి వాటిని ప్లాన్​చేసుకోండి.
  • ఫ్రెండ్స్‌‌తో  మాట్లాడుతున్నప్పుడు ఫోన్లు పక్కన పెట్టండి. క్వాలిటీ టైంను స్పెండ్​ చేయండి. - స్క్రీన్ టైమ్ తగ్గించి రియల్ టైమ్ పెంచండి.  

తల్లిదండ్రులదే మొదటి బాధ్యత 

ఈ ప్రస్తుత సమాజంలో స్నేహితులు తగ్గిపోతున్నారన్నది వాస్తవమే. ప్రతి ఒక్కరూ దీన్ని ఎక్స్​పీరియన్స్​చేస్తున్నారు. ముఖ్యంగా జెన్​జీ ల్లో ఫ్రెండ్‌‌షిప్​డెవలప్​అవట్లేదు. వీళ్లు ఏదీ ఎవరితో షేర్ చేసుకోలేకపోతున్నారు. వాళ్ల బాధను కూడా చాట్​జీపీటీతో షేర్​చేసుకుంటున్నారు. అది మనిషిలా ఓదార్చదు కదా..అందుకే డిప్రెషన్​లోకి పోతున్నారు. ఒకరితో ఒకరు మాట్లాడుకోకపోవడం రుగ్మతగా మారుతున్నది. ఇక ఈ జమానాలో ఐటీలో పని చేసే దంపతులు సింగిల్​చైల్డ్‌‌తో సరిపెట్టుకుంటున్నారు. దీంతో సిబ్లింగ్స్​లేక ఇంట్లో పిల్లలు ఒంటరిగా గడుపుతూ ఆ వాతావరణానికి అలవాటు పడిపోతున్నారు.  ఈ తరం పేరెంట్స్‌‌ ఇద్దరు సంపాదించాలనే ఆలోచిస్తున్నారు. పిల్లల వికాసాన్ని చూడలేక పోతున్నారు. ఫ్యామిలీ వాతావరణాన్ని పెంచి పిల్లలు వారి స్నేహితులతో కలిసేలా చేయాల్సిన అవసరం పేరెంట్స్ పై కచ్చితంగా ఉంది.  
- జేవీ శ్రీరామ్​,  లైఫ్​ స్కిల్​ కోచ్​, హైదరాబాద్​ 

హెల్తీ ఫ్రెండ్‌‌షిప్‌‌​ అవసరం  

స్టడీ కోసం సిటీకి వచ్చాక చిన్నప్పటి ఫ్రెండ్స్‌‌తో  ఇంటరాక్షన్​తగ్గింది. ఇక్కడ కొత్త ప్రాంతంలో నాకు ఎవరితో మాట్లాడాలనిపించేది కాదు. ఎప్పుడూ ఐసోలేటెడ్‌‌గా ఉండేదాన్ని. ఏదైనా విషయాన్ని ఎవరైనా ఫ్రెండ్స్‌‌తో షేర్​చేసుకోవాలనుకోవాలి అనుకున్నప్పుడు ఎవరూ ఉన్నట్టు అనిపించేది కాదు. ఒక్కోసారి ఏడుపు వచ్చేది. తర్వాత తర్వాత పరిస్థితి మార్చుకున్న. నా వ్యక్తిత్వాన్ని గౌరవించే స్నేహితులను పరిచయం చేసుకున్నా. నా  కాలేజీ స్నేహితులు, సీనియర్లలతో సంతోషంగా ఉంటున్నా. నేటి యువతకు హెల్తీ ఫ్రెండ్‌‌షిప్ అవసరం.  
– ఎ. నందు, పీజీ స్టూడెంట్‌‌, 
ఓయూ, హైదరాబాద్​