Ashika Ranganath: సోషల్ మీడియాలో అషికా రచ్చ..ఏంటీ వరాలు అసలు ఉహించలేదే!

Ashika Ranganath: సోషల్ మీడియాలో అషికా రచ్చ..ఏంటీ వరాలు అసలు ఉహించలేదే!

క్రేజీ బాయ్ సినిమాలో అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించిన నటి  ఆషిక రంగ‌నాథ్ (Ashika Ranganath) . ఆ తర్వాత కామెడీ థ్రిల్లర్ చిత్రం అవతార పురుష పార్ట్ 2 లోను కనిపించింది. కన్నడలో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నఆషిక రంగ‌నాథ్ తెలుగు తెరపై కల్యాణ్‌రామ్‌ హీరోగా  2023లో వచ్చిన అమిగోస్‌తో తెలుగుతెరకు పరిచయమయింది.

ఇక ఆ తర్వాత నాగార్జున సరసన నా సామి రంగ చిత్రంలో వరలక్ష్మీ అలియాస్ వరాలు అనే పాత్ర చేసి అదరగొట్టేసింది. ఇంత‌లోనే మెగాస్టార్ చిరంజీవి విశ్వంభ‌ర‌లో ఒక కీల‌క పాత్ర‌లో న‌టిస్తోంద‌ని కూడా వార్తలొస్తున్నాయి. దీంతో నెమ్మ‌దిగా ఆషిక అడుగులు టాలీవుడ్ లోను ముందుకు ప‌డుతున్నాయి. మునుముందు ర‌ష్మిక‌లా పెద్ద స్టార్ అవ్వాల‌ని క‌ల‌లు కంటోంది. 

ఇపుడు ఇలాంటి స‌మ‌యంలో గ్యాప్ లెస్ గా త‌న ఫొటోషూట్ల‌తో కుర్ర‌కారు మతిపోగొడుతోందీ అమ్మడు. ఇప్పుడు అలాంటి ఒక బోల్డ్ ఫోటోషూట్ తో ఆషిక గుబులు రేపుతోంది. బ్లాక్ థీమ్డ్ ఫొటోషూట్ లో ఆషిక థై స్లిట్ ఫ్రాక్ రచ్చ చేస్తోంది. గ్రే షేడ్ నేప‌థ్యంలో ఆషిక బ్లాక్ ఫ్రాక్ ధ‌రించ‌డంతో ఈ ఫోటోషూట్ కి ప్రత్యేకత వచ్చింది. ప్రస్తుతం ఈ హాట్ ట్రీట్ ఫోటోలు సోషల్ మీడియాలో దుమ్మరేపుతున్నాయి.