
ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ఎక్సైజ్ శాఖను ప్రక్షాళన చేస్తామన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. . లిక్కర్ సరఫరాలో బ్లాక్ మార్కెటింగ్ ను పటిష్టంగా నివారిస్తున్నామని చెప్పారు. మద్యం కొరత ఉంటే రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం తప్ప ప్రజలకు కాదన్నారు. దొంగే దొంగ అన్నట్లుగా BRS నేతల తీరు ఉందని విమర్శించారు . గత ప్రభుత్వం అనేక శాఖల్లో బిల్లులను పెండింగ్ లో పెట్టిందని ఆరోపించారు
తెలంగాణలో కొత్త మద్యం బాండ్లు తీసుకొస్తామనేది అబద్ధమని చెప్పారు. కొత్త బాండ్ల పై అసలు పరిశీలనే జరగలేదన్నారు. గత ప్రభుత్వం చాలా బిల్లులను పెండింగ్ లోపెట్టిందని చెప్పారు. రైతు భరోసాకు రూ. 6 వేల కోట్లకు పైగా తమ ప్రభుత్వ హయాంలోనే జరిగాయని చెప్పారు. టానిక్‌లకు గత ప్రభుత్వం ఇచ్చిన పన్ను మినహాయింపులను రద్దు చేశామని చెప్పారు.