నియామక పత్రాలిచ్చి..గాలికొదిలేసిండ్రు: మాజీ మంత్రి హరీశ్​రావు

నియామక పత్రాలిచ్చి..గాలికొదిలేసిండ్రు: మాజీ మంత్రి హరీశ్​రావు
  • జీతాలందక 4 వేల మంది నర్సింగ్ ఆఫీసర్లకు ఆర్థిక ఇబ్బందులు

హైదరాబాద్: నర్సింగ్‌ ఆఫీసర్లకు కాంగ్రెస్‌ ప్రభుత్వం 4 నెలలుగా జీతాలివ్వలేదని మాజీ మంత్రి హరీశ్‌రావు ఎక్స్‌(ట్విటర్‌) వేదికగా విమర్శించారు. బీఆర్ఎస్​హయాం లో చేసిన రిక్రూట్‌మెంట్‌ను ఈ సర్కార్​తన ఖాతాలో వేసుకుందని ఆరోపించారు. ఎల్బీ స్టేడియం వద్ద అట్టహాసంగా నియామక పత్రాలిచ్చి గాలికి వదిలేసింది తప్ప, వారి జీతభత్యాల గురించి అస్సలు పట్టించుకోవడం లేదని ఎద్దేవా చేశారు.

జీతాలందక 4 వేల మంది నర్సింగ్ ఆఫీసర్లు  ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు చెల్లిస్తున్నట్లు లేని గొప్పలు చెప్పు కుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పటికైనా వాస్తవాలు గుర్తించాలన్నారు. పెండింగ్‌లో ఉన్న నాలుగు నెలల జీతాలును తక్షణం చెల్లించాలని డిమాండ్​చేశారు.