Indian2 SOURAA Promo: ఇండియన్ 2 ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్..తెలుగు లిరిక్స్ అందించింది ఎవరంటే?

Indian2 SOURAA Promo: ఇండియన్ 2 ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్..తెలుగు లిరిక్స్ అందించింది ఎవరంటే?

28 ఏళ్ల తర్వాత భారతీయుడు మూవీకి సీక్వెల్గా వస్తోన్న భారతీయుడు 2 (Indian 2) మూవీని శంకర్ ఎంతో ప్రేస్టీజియస్ గా తెరకెక్కిస్తున్నాడు. యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ మూవీలో కాజల్‌ అగర్వాల్‌, సిద్ధార్థ్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, బాబీ సింహా,సముద్రఖని తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు.

తాజాగా భారతీయుడు 2 నుండి ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్ చేశారు మేకర్స్.ఒక భారతీయుడు ధైర్యం మరియు అతని పరాక్రమంతో అవినీతి పరులను అంతమొందించడానికి ఎలా ముందుకు సాగాడు! అంటూ ప్రోమో కి ట్యాగ్ ఇచ్చారు.ఈ ప్రోమోలో కమల్ గుర్రం మీద కూర్చుని ఖాళీ మైదానంలో స్వారీ చేస్తూ కనిపించారు.ఫాస్ట్ బీట్ తో నడిచే ఈ ప్రోమోలో కమల్ ముఖం సరిగా కనిపించలేదు.కాగా శౌరా అంటూ సాగే ఈ పాటకు జాతీయ అవార్డు గ్రహీత సుద్దాల అశోక్ తేజ లిరిక్స్ అందించారు.

లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతం అందించిన పూర్తి పాట రేపు (మే 22న)  సాయంత్రం 5 గంటలకు విడుదల కానుంది. ఇక భారతీయుడు 2 నుంచి మోగబోయే పాటల నగరాలో ఎలాంటి ప్రశ్నలు రేకిత్తిస్తారో అనే ఆసక్తి ప్రతిఒక్కరిలో ఉంది.అందుకు ఈ ఫస్ట్ సింగిల్ నిదర్శనంగా నిలిచే ఛాన్స్ ఉంది. 

ఇప్పటికే తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో రిలీజ్‌ చేసిన ఇంట్రో గ్లింప్స్‌ (AN INTRO) సినిమాపై భారీ అంచనాలు పెంచేసింది.పెంచడమే కాదు..కమల్‌హాసన్‌ వాడే ఆయుధం టాక్‌ ఆఫ్ ది టౌన్‌గా మారింది.ఈ మూవీ 12 జూలై 2024న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

  • Beta
Beta feature