బీరు సీసాలు తెచ్చినం.. అమ్మి గ్రామాభివృద్ధి చేయండి

బీరు సీసాలు తెచ్చినం.. అమ్మి గ్రామాభివృద్ధి చేయండి
  •     కొడిమ్యాల మండలంలో బీరు సీసాలు సేకరించి యువకుల నిరసన 
  •     మంత్రి వ్యాఖ్యలపై మండిపాటు

కొడిమ్యాల, వెలుగు : మంత్రి ఎరబెల్లి దయాకర్ రావు మాటలను వ్యతిరేకిస్తూ జగిత్యాల జిల్లా కొడిమ్యాల, మల్యాల మండలం బల్వంతాపూర్ గ్రామంలో గురువారం యువకులు బీరు సీసాలు సేకరించి వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. కోడిమ్యాలలో 50, బల్వంతా పూర్ లో 40 సీసాలు కలెక్ట్​చేసి గ్రామ పంచాయతీల కార్యదర్శులకు అందజేశారు. ఈ సందర్భంగా యువకులు మాట్లాడుతూ తాము సేకరించిన బీరు సీసాలు అమ్మగా వచ్చిన ఆదాయంతో రెండు గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టాలని కోరారు. మంత్రి దయాకర్ రావు మాటలు బాధ్యాతారహితంగా ఉన్నాయన్నారు. నక్క అనిల్, బోగ రాకేశ్, కంచర్ల. మనోజ్, చొక్కాల నరేశ్, కాముని మున్నా, సాయి పవన్ పాల్గొన్నారు.