వైఎస్సార్టీపీలోకి పొంగులేటి

వైఎస్సార్టీపీలోకి పొంగులేటి

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారుతారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనాలతో కూడా పొంగులేటి తన రాజకీయ భవితవ్యంపై పరోక్షంగా కామెంట్ చేశారు. ఎవరు అడ్డుకున్నా ఏ గూటి పక్షి ఆ గూటికే చేరుతుందంటూ కామెంట్ చేశారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల చేసిన కామెంట్ ప్రాధాన్యం సంతరించుకున్నది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పార్టీలో చేరతానని తనకు హామీ ఇచ్చారని, మిగతా విషయాలు ఆయన్నే అడగాలని షర్మిల చెప్పారు. దీంతో పొంగులేటి ఆమె పార్టీలో చేరడం దాదాపు ఖాయమై పోయినట్టేనని తెలుస్తోంది. కాగా కొద్దిరోజుల క్రితమే పొంగులేటి షర్మిలతో భేటీ అయ్యారు.