ఉద్యోగాలను బిచ్చమేస్తున్నారా, దానం చేస్తున్నారా?

ఉద్యోగాలను బిచ్చమేస్తున్నారా, దానం చేస్తున్నారా?

సీఎం కేసీఆర్ నిరుద్యోగులను మోసం చేస్తున్నారని  YSR తెలంగాణ పార్టీ అధినేత వైఎస్ షర్మిల విమర్శించారు. మీడియా మిత్రులారా దయచేసి కేసీఆర్ ట్రాప్ లో పడొద్దని కోరారు. 56,979 కొలువులేవీ? అంటూ ఓ పేపర్లో వచ్చిన న్యూస్ పై స్పందించిన ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఖాళీగా ఉన్న లక్ష 91 వేల ఉద్యోగాలే కాకుండా కొత్త జిల్లాల ప్రకారం అవసరమైన ప్రతి ఉద్యోగాన్ని భర్తీ చేయాల్సిందేనని చెప్పారు. మీడియా మిత్రులు నిరుద్యోగుల ఆశలను చంపవద్దని.. అన్ని ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేయడంలో నిరుద్యోగుల పక్షాన నిలబడాలని కోరారు. 

నిరుద్యోగులకు మీరు ఉద్యోగాలను బిచ్చమేస్తున్నారా లేక దానం చేస్తున్నారా కేసీఆర్ గారూ అంటూ ప్రశ్నించారు షర్మిల. లేక మీ పార్టీ నేతలకు పదవులను బిస్కెట్ వేసినట్టు ఇస్తున్నారా? అని అన్నారు. కాంట్రాక్టు ఉద్యోగాలతో నెట్టుకొస్తానంటే వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలను పర్మినెంట్ గా భర్తీ చేయాల్సిందేనని డిమాండ్ చేశారు.