- విగ్రహాలు వేయకుండా10 ఫీట్ల రెయిలింగ్ ఏర్పాటు
- నెక్లెస్‌రోడ్, పీపుల్స్‌ప్లాజా నుంచి మట్టి విగ్రహాలకు ఓకే
- ‘పీవోపీ’ లను బేబీ పాండ్స్‌లో వేయాలని సూచన
- ట్యాంక్బండ్లోనే వేస్తాం : గణేశ్ ఉత్సవ సమితి
హైదరాబాద్ సిటీ, వెలుగు : ట్యాంక్‌బండ్‌పై నుంచి గణేశ్విగ్రహాల నిమజ్జనం అంశం మరోసారి వివాదాస్పదంగా మారింది. హైకోర్టు ఆదేశాల మేరకు ట్యాంక్‌బండ్‌పై నుంచి నిమజ్జనాలకు అనుమతి లేదని జీహెచ్‌ఎంసీ అధికారులు, పోలీసులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ట్యాంక్‌బండ్ పై నుంచి విగ్రహాలు వేయకుండా10 ఫీట్ల రెయిలింగ్ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్మార్గ్, పీపుల్స్‌ప్లాజా, నెక్లెస్‌రోడ్‌లలో ఏర్పాటు చేస్తున్న క్రేన్ల నుంచి కేవలం మట్టి, పర్యావరణ హిత విగ్రహాలను మాత్రమే నిమజ్జనం చేస్తామని చెప్తున్నారు. అలాగే, ప్లాస్టర్ఆఫ్ప్యారిస్విగ్రహాలను నెక్లెస్‌రోడ్, పీపుల్స్ప్లాజాల వద్ద ఏర్పాటు చేసిన బేబీ పాండ్లలోనే నిమజ్జనం చేయాలని సూచిస్తున్నారు.
అస్సలు ఒప్పుకోం : గణేశ్ ఉత్సవ సమితి
ట్యాంక్‌బండ్‌పై నుంచి నిమజ్జనం లేదని అధికారులు ప్రకటించడాన్ని గణేశ్ఉత్సవ సమితి వ్యతిరేకిస్తోంది. ట్యాంక్‌బండ్ సంప్రదాయ నిమజ్జన ప్రాంతమని, అక్కడే విగ్రహాలను నిమజ్జనం చేస్తామని స్పష్టం చేసింది. ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను రెండు రోజుల్లో తొలగించాలని, లేకపోతే తామే తీసేసి నిమజ్జనాలు చేస్తామని హెచ్చరించింది. తమ పండుగలకు కావాలని ఇబ్బందులు పెట్టడం అలవాటుగా మారిందని ఆరోపిస్తోంది.
చివరి రోజు వదిలేస్తారు..
నిషేధం విధించిన నాటి నుంచి ప్రతి ఏడాది నిమజ్జనం మొదలయ్యే మూడో రోజుకు ముందే బల్దియా, సిటీ పోలీసులు ట్యాంక్‌బండ్‌పై నుంచి విగ్రహాలను నిమజ్జనం చేయరాదని ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేస్తున్నారు. కానీ, 11వ రోజు యథావిధిగా ట్యాంక్‌బండ్‌పై క్రేన్లు ఏర్పాటు చేసి నిమజ్జనాలు చేయిస్తోంది. గతేడాది ట్యాంక్ బండ్ పై చివరి రోజు ఏకంగా 12 క్రేన్లను ఏర్పాటు చేసింది. ఎన్టీఆర్ మార్గ్ లో 12, పీవీ మార్గ్ లోని పీపుల్స్ ప్లాజాలో 8 క్రేన్లను పెట్టి మట్టి వినాయకులంటూ పీవోపీ విగ్రహాలను కూడా నిమజ్జనం చేస్తోంది.
హైకోర్టు ఏం చెప్పిందంటే..
పర్యావరణ పరిరక్షణ నేపథ్యంలో ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పీఓపీ) విగ్రహాలను హుస్సేన్‌సాగర్ తో పాటు ఇతర సహజ చెరువుల్లో నేరుగా నిమజ్జనం చేయడంపై హైకోర్టు 2021లో నిషేధం విధించింది. ప్రత్యామ్నాయంగా కృత్రిమ ‘బేబీ పాండ్స్ఏర్పాటు చేయాలని ఆదేశాలిచ్చింది. ట్రాఫిక్ఇబ్బందుల నేపథ్యంలో అప్పర్ ట్యాంక్‌బండ్ నుంచి కూడా నిమజ్జనాన్ని నిషేధించింది. అదే ఏడాది సుప్రీంకోర్టు ప్రత్యేక పరిస్థితుల్లో 2021కి మాత్రమే నిమజ్జనానికి అనుమతిచ్చింది. తదుపరి సంవత్సరాల్లో పర్యావరణహిత ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ఆధారంగా ఈ మినహాయింపు ఇచ్చింది. 2023లో తెలంగాణ హైకోర్టు హుస్సేన్‌సాగర్‌లో ప్లాస్టర్ఆఫ్ప్యారిస్విగ్రహాలను నిమజ్జనం చేయుండా నిషేధం ఉంటుందని మరోసారి స్పష్టం చేసింది. పీఓపీ విగ్రహాలను గుర్తించి, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కృత్రిమ కొలనులకే తరలించేలా హైదరాబాద్ సీపీ, జీహెచ్‌ఎంసీ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
