షర్మిల పర్యటనకు ఏర్పాట్లు పూర్తి

షర్మిల పర్యటనకు ఏర్పాట్లు పూర్తి

వరద బాధిత ప్రాంతాల్లో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల పర్యటించనున్నారు. మూడు రోజుల పాటు ఈ పర్యటన కొనసాగనుంది. ఈ నెల 21వ తేదీ ఉదయం 7.30 గంటలకు లోటస్ పాండ్ నుంచి షర్మిల వెళ్లనున్నారు. మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలో మొదటి రోజు పర్యటన కొనసాగనుంది. శామిర్ పేట, సిద్ధిపేట, చొప్పదండి, ధర్మారం, వెలగతూర్, రాయపట్నం, ధర్మపురి, ఇందెనపల్లి, జిన్నారం మీదుగా ఉదయం 11.00 గంటలకు కోయపోశయ్య గూడెంకు చేరుకుంటారు. అక్కడ పోడు రైతులతో షర్మిల మాట్లాడనున్నారు. అనంతరం 1.00 గంటకు భోజన విరామం తీసుకుంటారు. మూడు గంటలకు దండెపల్లి ప్రాంతంలో ఏర్పాటు చేసిన భోజన శిబిరాన్ని సందర్శిస్తారు. సాయంత్రం 4.00 గంటలకు మంచిర్యాల పట్టణానికి చేరుకున్న అనంతరం ముంపు ప్రాంతాల్లో పర్యటించనున్నారు. దండెపల్లి, లక్సెటిపేట, హాజీపూర్ ల మీదుగా షర్మిల రానున్నారు. సాయంత్రం 6.00 గంటలకు రామగుండం పట్టణానికి చేరుకుని అక్కడే షర్మిల విశ్రాంతి తీసుకుంటారు.