ఢిల్లీలో సోనియాతో వైఎస్ షర్మిల భేటీ.. పార్టీని విలీనం చేస్తారా..? పొత్తు పెట్టుకుంటారా..?

ఢిల్లీలో సోనియాతో వైఎస్ షర్మిల భేటీ.. పార్టీని విలీనం చేస్తారా..? పొత్తు పెట్టుకుంటారా..?

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కాంగ్రెస్ లో విలీనానికి లైన్ క్లియర్ అయ్యిందా...? చర్చలు చివరి దశకు వచ్చాయా...? ఇదే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తి రేపుతోంది. ఢిల్లీ వెళ్లిన వైఎస్ షర్మిల.. సోనియాగాంధీ నివాసానికి వెళ్లారు. అక్కడ సోనియాతో వైఎస్ షర్మిల భేటీ అయ్యారు. కాంగ్రెస్ లో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ విలీనంపై ఇద్దరి మధ్య చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. 

ఆగస్టు 31వ తేదీ సోనియా గాంధీ ముంబై వెళ్లనున్నారు. ఈ క్రమంలో వైఎస్ షర్మిల.. సోనియాగాంధీతో భేటీ అయ్యారు. షర్మిల పార్టీ విలీనం లేదా పొత్తుల అంశంపై ఫైనల్ డిస్కర్షన్స్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. గతంలో ఢిల్లీకి వెళ్లిన షర్మిల.. కాంగ్రెస్ సీనియర్ నాయకులతో చాలాసార్లు మంతనాలు జరిపారు. ఈసారి డైరెక్టుగా సోనియాతో భేటీ అయ్యారు. తెలంగాణ రాజకీయాలతో పాటు పార్టీ విలీనం, పొత్తులపై అంశాలపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. 

అయితే.. కాంగ్రెస్ నుంచి షర్మిలకు కొన్ని కండీషన్స్ వచ్చాయని తెలుస్తోంది. ఒకవేళ పార్టీ విలీనం చేస్తే తెలంగాణలోనే కాకుండా దేశ వ్యాప్తంగా పార్టీ అవసరాల దృష్ట్యా పని చేయాల్సి ఉంటుందని కాంగ్రెస్ పార్టీ షర్మిలకు కండీషన్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ షరతుకు వైఎస్ షర్మిల అంగీకరించలేదని సమాచారం. తాను ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వబోనని ముందే స్పష్టం చేసినట్లు వార్తలొస్తున్నాయి. కేవలం తెలంగాణ రాజకీయాల్లోనే కొనసాగుతానని షర్మిల.. కాంగ్రెస్ పెద్దలకు చెప్పారని తెలుస్తోంది. 

షర్మిల పార్టీని కాంగ్రెస్ లో విలీనాన్ని తెలంగాణ పీసీసీ మొదటి నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ప్రస్తుతం వైఎస్ షర్మిల ఢిల్లీ టూర్ రాజకీయ వర్గాల్లో ఉత్కంఠతో పాటు ఆసక్తిని పెంచింది. మరోవైపు... షర్మిల ఢిల్లీ పర్యటన వివరాలను గోప్యంగా ఉంచారు. ఈ టూర్ పూర్తిగా రాజకీయ పరమైన అంశాలతో ముడిపడి ఉన్నట్లుగా తెలుస్తోంది.