మద్యం అమ్మకాలను పెంచడం ఎలా? అని అడగాల్సింది

V6 Velugu Posted on Jan 14, 2022

హైదరాబాద్:  మంత్రి కేటీఆర్‌పై YS షర్మిల సెటైర్లు విసిరారు. ‘‘తెలియనిది అడిగితే పాపం కేటీఆర్ ఏమని సమాధానం చెప్తారు?... అసలు అడగాల్సింది..మద్యం అమ్మకాలను పెంచడం ఎలా? ... ఆడవాళ్ల మానప్రాణాలకు హాని కలిగించడం ఎలా?... జనాలను డ్రగ్స్‌కు బానిస చెయ్యడం ఎలా?... రైతుల ఆత్మహత్యల్లో రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవడం ఎలా?...  నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకొనేలా చేయడం ఎలా?... దళితులను మోసం చేయడం ఎలా?.. వరి వేసిన వాళ్లకు ఉరి వేయడం ఎలా?... ఉద్యోగుల మధ్య చిచ్చు పెట్టడం ఎలా?.. ఉద్యమకారులను తొక్కేయడం ఎలా?... ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టి జైలుకు పంపించడం ఎలా... పార్టీ లీడర్లు తప్పులు చేస్తే కాపాడుకోవడం ఎలా? ... వీటికైతే బాగా సమాధానం చెప్పగలరు కదా చిన్న దొరగారు?’’ అంటూ షర్మిల ట్వీట్ చేశారు. 

 

Tagged KTR, Tweets, Sharmila, ask ktr, , YSRTP

Latest Videos

Subscribe Now

More News