పొలిటికల్ యాక్షన్ డ్రామాగా ‘నా పేరు శివ 2’

పొలిటికల్ యాక్షన్ డ్రామాగా  ‘నా పేరు శివ 2’

కార్తి హీరోగా వచ్చిన ‘నా పేరు శివ’ చిత్రం తమిళంతో పాటు తెలుగులోనూ మెప్పించింది. పదకొండేళ్ల తర్వాత ఇదే తరహా కంటెంట్‌‌‌‌‌‌‌‌తో ‘నా పేరు శివ 2’ తో వస్తున్నాడు కార్తి. ఇదో పొలిటికల్ యాక్షన్ డ్రామా. రజినీకాంత్‌‌‌‌‌‌‌‌తో కబాలి, కాలా చిత్రాలు తీసిన పా రంజిత్ దీనికి దర్శకుడు. కె.ఇ.జ్ఞానవేల్ రాజా నిర్మాత. కేథరిన్ థ్రెస్సా హీరోయిన్‌‌‌‌‌‌‌‌గా నటించింది. ఆల్రెడీ తమిళంలో విడుదలైన ఈమూవీ  కమర్షియల్‌‌‌‌‌‌‌‌గా సక్సెస్​ సాధించింది. ఇప్పుడీ సినిమాను తెలుగులో విడుదల చేయబోతున్నారు జ్ఞానవేల్ రాజా. నిన్న కార్తి ఫస్ట్ లుక్‌‌‌‌‌‌‌‌ను లాంచ్ చేశారు. సినిమాను ఈ నెల13న రిలీజ్ చేయబోతున్నట్టు చెప్పారు.