V6 News

తెలంగాణ అన్ని రంగాల్లో పురోగమిస్తున్నది : మంత్రి శ్రీధర్బాబు

తెలంగాణ అన్ని రంగాల్లో పురోగమిస్తున్నది : మంత్రి శ్రీధర్బాబు

ముషీరాబాద్, వెలుగు : పరిశ్రమలు ఆవిష్కరణల ఆధారిత రంగాల్లో తెలంగాణ పురోగమిస్తోందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. బుధవారం ఆర్టీసీ కల్యాణ మండపంలో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ సీఎస్ఆర్ స్కాలర్​షిప్​కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. రాష్ట్రంలోని 5,050 మంది విద్యార్థులకు రూ.4.55 కోట్ల విలువైన స్కాలర్​షిప్​లను పంపిణీ చేశారు.

 మంత్రి మాట్లాడుతూ పేద విద్యార్థుల చదువుకు డబ్బు సమస్య అడ్డంకి కాకూడదని సీఎం రేవంత్ రెడ్డి చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. సీఎస్ఆర్​లో భాగంగా మరిన్ని కార్పొరేట్ సంస్థలు భాగస్వాములు కావాలని కోరారు. మలబార్ గ్రూప్ చైర్మన్ అహ్మద్, ఆషర్, సిరాజ్, ఇళమ్ గోవన్, షరీజ్ పాల్గొన్నారు.