- టీచర్ల మానసిక వేధింపులే కారణమని సూసైడ్ నోట్
న్యూఢిల్లీ: టీచర్లు, ప్రిన్సిపల్ వేధించారని టెన్త్ క్లాస్ విద్యార్థి (16) మెట్రో స్టేషన్ నుంచి దూకి సూసైడ్ చేసుకున్నాడు. తన ఆత్మహత్యకు నలుగురు టీచర్లు కారణమని, వారిపై చర్యలు తీసుకోవాలని సూసైడ్ నోట్‌లో కోరాడు. అమ్మ, నాన్న, సోదరుడు క్షమించాలని వేడుకున్నాడు.
ఆ బాలుడు ఢిల్లీ అశోక్ ప్లేస్‌లోని సెయింట్ కొలంబా స్కూల్‌లో టెన్త్ చదువుతున్నాడు. మంగళవారం మధ్యాహ్నం స్కూల్ యూనిఫాంలోనే రాజేంద్ర ప్లేస్ మెట్రో స్టేషన్ నుంచి కిందకు దూకి చనిపోయాడు. శౌర్య స్కూల్ బ్యాగ్‌లో సూసైడ్ నోట్ లభించింది.“టీచర్ల వేధింపుల వల్లే సూసైడ్ చేసుకుంటున్నా. వారు మానసికంగా వేధించారు. తీవ్రంగా అవమానించారు. వారిపై చర్యలు తీసుకోండి”అని అందులో బాలుడు కోరాడు.
